ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్న ధోని... వీడియో వైరల్

     Written by : smtv Desk | Tue, Jul 27, 2021, 02:15 PM

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్న ధోని...  వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని త్వ‌ర‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడ‌నున్నాడు. బ్యాట్ ప‌ట్టి సిక్స‌ర్లు కొట్టే ధోనీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడ‌నుండ‌డం ఏంటీ అనుకుంటున్నారా? స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం ఆయ‌న ‘ఆల్‌ స్టార్స్‌’ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పాల్గొన‌నున్నాడు. త్వ‌ర‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో ప‌లువురు సాధ‌న మొద‌లు పెట్టారు.తాజాగా, ధోనీతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో ఫుట్‌బాట్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. వారిద్ద‌రూ మైదానంలో ప‌రుగులు తీస్తూ ఫుట్‌బాల్ మ్యాచు ఆడుతుండడం ఆక‌ర్షిస్తోంది. ఈ సంద‌ర్భంగా ర‌ణ్‌వీర్ మాట్లాడుతూ... ధోనీని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ధోనీ, ర‌ణ్‌వీర్ మైదానంలో చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారు. భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్ కూడా వారిద్ద‌రితో పాటే ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశాడు.

Untitled Document
Advertisements