సప్తతాళములు !

     Written by : smtv Desk | Tue, Jul 27, 2021, 04:41 PM

సప్తతాళములు !

వాలి సుగ్రీవుల యుద్ద సమయంలో శ్రీరాముడు వాలిని జయించగలడని సుగ్రీవునకు నమ్మకము కుదరలేదు. అది గ్రహించిన రాముడు "సుగ్రీవా? ఇంకా ఎందుకీ విచారము? నీ అన్నను గెలుచుట నాకు పెద్ద కష్టమేమీ కాదు" అంటూ ఒక బాణమును తీసి వింటికి సంధించి సమీపంలోనే వున్న ఏడు తాళవృక్షాలకు తగిలేవిధంగా వదిలాడు. ఆ ఒక్కబాణం దెబ్బకే ఏడు వృక్షాలు ఒకేసారిగా నేలకులాయి. దానితో సుగ్రీవుడు ఆనందాశ్చర్యములతో "మహాత్మా! తమరి పరాక్రమము తెలుసుకోనలేకపోయాను. నన్ను క్షమించి నీ ఎదుట ఏ శక్తి నిలబడలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ స్నేహం లభించినందుకు నేను ధన్యుడను" అనగా-రాముడు నవ్వుతూ "వెళ్ళు సుగ్రీవా! నీ అన్నాను యుద్దానికి పిలువు" మని చెప్పాడు. రాముడిచ్చిన ధైర్యముతో సుగ్రీవుడు కిష్కింధకు బయలుదేరాడు.





Untitled Document
Advertisements