లాభాలతో ఆరంభమైన స్టాక్‌ మార్కెట్లు...

     Written by : smtv Desk | Tue, Dec 26, 2017, 10:39 AM

లాభాలతో ఆరంభమైన స్టాక్‌ మార్కెట్లు...

ముంబాయి, డిసెంబర్ 26: వరుసగా మూడు రోజుల నష్టాల తరువాత ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో ఎగిసింది. నిఫ్టీ ఎంతో కీలకమైన 10,500 మార్కును దాటగా, సెనెక్స్‌ తొలిసారి 34వేల మార్కుని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 44 పాయింట్ల లాభంలో 33,985 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,507 వద్ద కొనసాగుతుంది.

టీసీఎస్‌, బీహెచ్‌ఈఎల్‌, టాటా పవర్‌, గెయిల్‌ లాభాలు పండించగా.. టాప్‌ లూజర్లుగా టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మాలు నష్టాలు గడించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరిగి 64.03 వద్ద ఉంది.

Untitled Document
Advertisements