కొత్త శిఖరాలకు చేరుకున్న సెన్సెక్స్...

     Written by : smtv Desk | Tue, Dec 26, 2017, 04:36 PM

కొత్త శిఖరాలకు చేరుకున్న సెన్సెక్స్...

ముంబాయి, డిసెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అధిరోహించింది. వరుసగా శని, అది, క్రిస్మస్‌ను పురస్కరించుకుని మూడు రోజుల విరామం తరువాత కీలక సూచీ సెన్సెక్స్‌ 34వేలకు ఎగువన పటిష్టంగా స్థిరపడింది. ఇదే బాటలో నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 10,500కి ఎగువన 10, 536 ముగిసింది. అన్నిట్లో మెటల్‌ సెక్టార్‌ టాప్‌ విన్నర్‌గా నిలిచింది.

సిప్లా, బాష్‌, వేదాంత, ఆర్‌ఐఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌, భారీగా లాభ పడగా, ముఖ్యంగా డీఎల్‌ఎఫ్‌,సెయిల్‌, జెట్‌ఎయిర్‌వేస్‌ 52వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఎస్‌డీఆర్‌ ప్రకటనతో ఆర్‌ కాం 40శాతానికిపై లాభపడడం విశేషం. జస్ట్‌ డయల్‌, జేపీ అసోసియేట్‌ లాభాలను ఆర్జించాయి. కోల్‌ఇండియా, ఎస్‌బీఐ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, హిందుస్థాన్‌ యుని లివర్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Untitled Document
Advertisements