కేవలం రూ.499కే బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌...

     Written by : smtv Desk | Tue, Dec 26, 2017, 05:02 PM

కేవలం రూ.499కే  బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌...

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: వినియోగదారులకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. రూ.499కే అత్యంత చవకగా మొబైల్ ను అందించనుంది. ఈ ఫోన్ వ్యాలిడిటీ 365 రోజులు. వాడుకునేందుకు రూ.103 టాక్‌టైమ్‌,బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 40 పైసలు కాల్‌రేట్‌గా నిర్ణయించారు. వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్‌బ్యాక్‌ టోన్‌ సౌకర్యం కల్పించారు.

ఈ ఫోన్ ఫీచర్లు, మోడ్స్ ఇలా ఉన్నాయి...
# డీ1 మొబైల్‌లో 1.44 అంగుళాల తెర
#650 ఎంఏహెచ్‌ బ్యాటరీ
# టార్చ్‌లైట్‌, ఫోన్‌బుక్‌, ఎఫ్‌ఎం రేడియో, స్పీకర్‌, వైబ్రేషన్‌ మోడ్స్

Untitled Document
Advertisements