న్యూ ఇయర్లో వొడాఫోన్‌ వోల్టీ సేవలు..

     Written by : smtv Desk | Tue, Dec 26, 2017, 05:25 PM

న్యూ ఇయర్లో వొడాఫోన్‌ వోల్టీ సేవలు..

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టెలికాం ఉత్పత్తుల సంస్థలు వినియోగదారులకు తెగ ఆఫర్లను అందిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ (వోల్టీ) సేవలను ప్రారంభించనున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ప్రకటించింది.

కంపెనీ ఓ ప్రకటనలో వొడాఫోన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఈవో సునీల్‌ సూద్‌.." వినియోగదారులకు హెచ్‌డీ క్వాలిటీ కాలింగ్‌ సదుపాయాన్ని అందించనున్నాం. మా నెట్‌వర్క్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇది మరింత ఉపయోగపడుతుంది" అని పేర్కొన్నారు. ముందుగా ఈ సేవలను ముంబయి, గుజరాత్‌, దిల్లీ, కర్ణాటక, కోల్‌కత్తాలలో అందించనున్నట్లు తెలిపారు.


Untitled Document
Advertisements