వాట్సాప్‌లో ఆ ఎమోజీను 15 రోజుల్లో తొలగించాలి...

     Written by : smtv Desk | Wed, Dec 27, 2017, 02:01 PM

వాట్సాప్‌లో ఆ ఎమోజీను 15 రోజుల్లో తొలగించాలి...

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సోషల్ మీడియాలో దిగ్గజమైన వాట్సాప్‌, అందులోని ఎమోజీలు యూజర్లకు ఎంతగా ఉపయోగపడుతాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ న్యాయవాది అందులోని ఓ ఎమోజీపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు లీగల్‌ నోటీసులు పంపారు.

ఢిల్లీ సిటీ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న గుర్మీత్‌ సింగ్‌, వాట్సాప్‌లో ఉన్న మధ్య వేలు ఎమోజీని తొలగించాలని అందులో సూచించారు. ఆ ఎమోజీ అసభ్యకర సందేశానికి సంకేతమని, దాన్ని వెంటనే తొలగించాలని లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 354,509 ప్రకారం అశ్లీల, అసభ్యకర సంజ్ఞలను చూపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. 15 రోజుల్లో సదరు ఎమోజీని తొలగించాలని నోటిసులో తెలిపారు.

Untitled Document
Advertisements