పాత చెక్కులు ఇక చెల్లవు...

     Written by : smtv Desk | Thu, Dec 28, 2017, 01:36 PM

పాత చెక్కులు ఇక చెల్లవు...

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 28: కొద్ది రోజుల క్రితం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, భారతీయ మహిళా బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బీకనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాల, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్‌ లు ఎస్ బిఐ లో విలీనమైన సంగతి తెలిసిందే. అయితే పాత బ్యాంకుల చెక్కులు ఈ మాసాంతం వరకు ఉపయోగించుకోవచ్చని అవకాశం కల్పించగా, ఇప్పుడు ఆ గడువు ముగియనుంది. విలీనమైన బ్యాంకుల శాఖలకు సంబంధించి ఇప్పటికే కొత్త ఐఎఫ్ఎస్ సి కోడ్‌ను కూడా కేటాయించారు. కొత్త చెక్‌బుక్స్‌ కోసం ఖాతాదారులు తమతమ బ్యాంకుల్లో సంప్రదించాలని ఎస్‌బిఐ ప్రకటించింది.

Untitled Document
Advertisements