నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

     Written by : smtv Desk | Thu, Dec 28, 2017, 04:10 PM

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబాయి, డిసెంబర్ 28: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం 50 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ఉత్సాహంగా ఆరంభించింది. సెన్సెక్స్‌ 63.78 పాయింట్ల నష్టంలో 33,848 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంలో 10,500కి కింద 10,477.9 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.64.10గా కొనసాగుతోంది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 14.5 శాతం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ 6 శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 11.4 శాతం లాభాలు పండించాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.

Untitled Document
Advertisements