శుభ, అశుభ శకునాలని వేటినంటారు!

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 05:08 PM

శుభ, అశుభ శకునాలని వేటినంటారు!

శుభఅశుభ సూచికలను శకునం అంటారు. కొన్ని దేశాలలో శకునాల నమ్మకం వుంది. భారతదేశంలో కూడా ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఈ శకునాలను నమ్ముతారు. ఇవి రెండు రకాలు. శుభ శకునాలు, అశుభ శకునాలు. నల్లటి విత్తానాలు, ఎండిపోయిన పేడ, కట్టెలు, బోడి గుండుతో వున్న వ్యక్తులు మన ప్రయాణానికి ఎదురైతే అశుభం. ఎక్కడికి ప్రయాణం ఎంతదూరం, పనేమిటి అని ఎవరైనా అడిగితే అది అశుభం. మాంసాహారం తినే జంతువులు ఎదురైనా అశుభము క్రిందే భావించాలి. తెల్లని పుష్పలు, నీళ్ళకుండలు, శుభసూచికలు. ఆయుధాలు, రాజముద్రికలు, ఫలాలు, తేనె, భగవత్ నామస్మరణ వినిపించినా శుభసూచికలే. రాత్రిళ్ళు కన్పించేవి పగలు, పగలు కన్పించేవి రాత్రిపూట కన్పిస్తే ఆశుభంగా పరిగణిస్తారు. జంతువులు, పక్షులు వాటి అరుపులు రకరకాల శకునాలకు ప్రతీకలు. వాటిని బట్టి వారి ప్రయాణాలు జరపడం, మానుకోవడం, అపశకునాలకు తగిన పూజలు నిర్వహించడం మన సాంప్రదాయంలో ఒక భాగం.

Untitled Document
Advertisements