ప్రకృతి వైద్యంలో ఆహారమే ఔషధం!

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 05:13 PM

ప్రకృతి వైద్యంలో ఆహారమే ఔషధం!

ఆహార రహస్యాలను తెలుసుకునే భుజించే ఆహారమే అన్ని రోగాలకు అసలైన ఔషధం, ఈ విషయం తెలియక తినే ఆహారమే అన్ని రోగాలకు కారణం. ఈ మర్మం తెలుసుకోకుండా ఎన్ని ఔషధాలు వాడినా ప్రయోజనం ఉండదు. రోజురోజుకు ఎన్నో ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కొత్త కొత్త వైద్య పరికరాలను ఇతర దేశాల నుండి దిగుమతి కూడా చేసుకుంటున్నాం. కోట్ల మంది వైద్యులు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోగం కూడా పూర్తిగా నయం కాకపోవడం కి అసలు కారణం మనం తీసుకునే ఆహారం పైన మనకు పూర్తి అవగాహన లేకపోవడమే.
ఋతువు, కాలాలను బట్టి శరీర స్వభావం మారుతుంది. మారే స్వభావానికి తగ్గట్టుగా ఆహారాన్ని మార్చి తింటే మనిషికి ఏ వ్యాధి కలిగే అవకాశం లేదు. అలా కాకుండా అన్ని రోజుల్లోనూ ఒకే విధమైన, అందుబాటులో ఉన్న, చౌకగా లభించే పదార్థాలను భుజిస్తూ ఉంటే రోగాలు తగ్గవు.
వైద్య ప్రక్రియలో ఆహార మార్పిడి అతి ముఖ్యమైన అంశం. ఆహారమే చికిత్సలో ప్రధానం అన్న విషయాన్ని గుర్తించడం లేదు. సహజమైన సేంద్రీయ ఎరువులతో పండించిన పంటను మాత్రమే వండి, తిన్నప్పుడు ఆరోగ్యం చేకూరుతుంది. ఏ వ్యాధి ఏ ఆహార లోపం వల్ల కలుగుతుందో, ఏ వ్యాధికి ఏ ఆహార పదార్థాలను వాడాలో  తగిన వైద్య నిపుణుని సంప్రదించి తెలుసుకోవాలి. భారతీయ సేవన లో దాగిఉన్న ఆరోగ్య రహస్యాలను, యోగాభ్యాసం రహస్యాలను, అత్యంత శ్రద్ధాసక్తులతో పాటిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
ప్రతీ వ్యాధిలోనూ సుఖసాధ్యం, కష్టసాధ్యం, అసాధ్యం అనే మూడు దశలు ఉన్నాయి. మందులతో వ్యాధులు నయం అయినప్పుడు ఇన్ని మందులు ఎందుకు పెరుగుతున్నాయి? వ్యాపార నిమిత్తమే కానీ, అవి రోగాలను నయం చేయవు. ప్రకృతి వైద్యం లో అన్ని అసాధ్య రోగాలు కూడా నయమవుతాయి. ఎందరో రోగులకు పునర్జన్మ కలిగినది. రోగం మొదటి దశలోనే వచ్చినవారు నెలరోజుల్లోనే ఆరోగ్యాన్ని పొందవచ్చు. రెండవ దశలో వచ్చిన వారు రెండు నుంచి మూడు నెలల్లో, మూడవ దశలో వచ్చిన వారు నాలుగు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒక వ్యాధి తగ్గాలంటే ముఖ్యంగా నలుగురు వ్యక్తులు కలిసి పని చేయాలి. రోగి, వైద్యుడు, పరిచారకుడు, భగవంతుడు వీరినే పాదచతుష్టయమే అంటారు.
ముందుగా రోగి వైద్యుని యొక్క వైద్య మీద నమ్మకం ఉండాలి. ఏ చికిత్స చేస్తే అది చేయించుకోవాలి. ఏ పదార్థాన్ని తినమంటే అదే తినాలి. అప్పుడే రోగం తగ్గి, ఆరోగ్యం చేకూరుతుంది. వైద్యుడు రోగికి మానవతా దృక్పథంతో చికిత్స చేయాలి కానీ, ధనాశతో చేయరాదు. వైద్యుడు రోగి చెప్పినవి శ్రద్ధగా విని రోగికి వైద్యం చేయాలి. అప్పుడే వ్యాధి త్వరగా నయమవుతుంది
రోగికి పరిచర్యలు చేసేవారు డాక్టర్ సలహాను పాటించి, సేవ చేయాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఓపికతో సమయానికి మందులు ఇవ్వడం, ఆహారాన్ని తినిపించడం, సేవ చేయడం, ఎప్పటికప్పుడు రోగి ముఖకవళికలను గుర్తించి పరిచర్యలు చేయడం, పాలు, పళ్లరసం డాక్టర్ సలహా మేరకు ఇవ్వడం వంటి సపర్యలు చేస్తూ ఉంటే రోగం తప్పక తగ్గుతుంది. ఆహారం, నీరు, నిద్ర విషయంలో జాగ్రత్త వహించాలి.
రోగి, వైద్యుడు, పరిచారకులు జాగ్రత్తగా చూసినా, ఒక్కొక్కప్పుడు దైవము అనుకూలించాలి. రోగి గురించి ప్రార్థనలు చేయడం మనం చూస్తున్నాము. అందుకే గాంధీజీ అన్నారు. రోగ నామజపం మాని, రామనామ జపం చేయండి అని. రోగం వచ్చింది అని బాధపడటం కంటే రోగాన్ని నయం చేసుకోవడం ఎలాగో ఆలోచించండి. తగిన వైద్యుని సంప్రదించి రోగం నుండి విముక్తి పొందాలి.





Untitled Document
Advertisements