సొంతింటి కల కోసం LIC రూ.2 కోట్ల వరకు రుణాలు!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:19 AM

సొంతింటి కల కోసం  LIC రూ.2 కోట్ల వరకు రుణాలు!

మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ అందిస్తోంది. రూ.2 కోట్ల వరకు రుణాన్ని 6.66 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చని తెలిపింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

ఎల్‌ఐసీ హైసింగ్ ఫైనాన్స్ జూలై 1 నుంచే 6.66 శాతం వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందిస్తూ వస్తోంది. అయితే హోమ్ లోన్ మొత్తం రూ.50 లక్షల వరకు అయితేనే ఈ రేటు వర్తించేది. అయితే ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రుణాన్ని ఇదే వడ్డీ రేటుతో తీసుకోవచ్చు.

అయితే తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందాలంటే ఒక షరతు ఉంది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్ 700 లేదా ఆపైన ఉండాలి. అప్పుడే వీరికి 6.66 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది.

హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తోంది. రూ.10 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా 6 ఈఎంఐల మాఫీ ప్రయోజనం కూడా ఉంది. ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ వంటివి కూడా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి.





Untitled Document
Advertisements