మహాసేనుడు అంగారకుడ్ని ఏవిధంగా వధించాడు?

     Written by : smtv Desk | Mon, Oct 04, 2021, 02:44 PM

మహాసేనుడు అంగారకుడ్ని ఏవిధంగా వధించాడు?

అంగారకుడు పంది రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతని కుమార్తె అంగారవతి. ఉజ్జయినిని పాలించే మహేంద్రవర్మకు మహాసేన అనే కుమారుడు ఉండేవాడు. అతడు చాలాకాలం తపస్సు చేసి ఖడ్గాన్ని, భార్యను పొందే వరం పొందాడు. ఆ దేవీఖడ్గాన్నిచ్చి ఈ ఖడ్గం నీ చేతిలో ఉండగా నిన్నెవరూ జయించలేరని, ముళ్ళు కాలపు అందాలరాశి అయిన అంగారకుని కుమార్తె  అంగారవతి నీకు భార్య కాగలదని ఆశీర్వదించింది. ఊరు జూ మహాసేన రాజు రథంపై అడవికి వెళ్లగా పంది కనిపించింది. మహారాజు దానిపై అస్త్రాలు సంధించగా ఆ పంది ఏ మాత్రం చలించలేదు. అప్పుడు ఇతని రథం అదుపు తప్పి ఓ గుహలోకి వెళ్ళింది. రథాన్ని వెతుకుతూ ఇతడు ఒక వైపు వెళ్లగా అతనికి ఓ అందాలరాశి, కొందరు సుందరీమణులతో కనిపించింది. ఆమె తను అంగారకుడు అనే రాక్షసుడి కుమార్తెనని తన తండ్రి పంది రూపంలో ఉంటాడని మామూలు రూపంలో ఉండగా ఎందరో సుందరీమణుల ను తీసుకు వస్తాడు అని, అతని శరీరం మణిసదృశ్యమని ఎవరూ అతన్ని జయించలేని అని చెప్పగా మహాసేన రాజు ఆమెను తన తండ్రి వద్దకు వెళ్లి తాను అడగమని నట్లుగా ఆమెను తన తండ్రి మరణ రహస్యం అడగమని చెప్తాడు.
అప్పుడామే  మహాసేనుడు అడగమనట్లుగా " తండ్రి నీవు ఇన్ని ఘోర కృత్యాలు చేస్తున్నావు, నీవు లేకుంటే నాకు దిక్కెవరు" అని ఆమె అడుగగా " నన్ను ఎవరూ చంపలేరు, ఇల్లు కట్టుకునే ఎడమ అరచేతికి దెబ్బ తగిలితే మాత్రమే నేను మరణించ గలను" అని చెప్తాడు. వెంటనే మహాసేన రాజు అతనిపై యుద్ధం చేసి తన అస్త్రాలతో అతని ఎడమ చేతిని ఖండించగా అంగారకుడు మరణిస్తాడు. తరువాత అంగారవతిని వివాహమాడగా వారికి ఇద్దరు కుమారులు,  కుమార్తె కలిగారు వారే గోపాలక, పాలక, వాసవదత్త.





Untitled Document
Advertisements