పాక్ తో పోటీ పడే శక్తిసామర్థ్యాలు టీమిండియా కు లేవు ?

     Written by : smtv Desk | Tue, Oct 05, 2021, 04:44 PM

పాక్ తో పోటీ పడే శక్తిసామర్థ్యాలు టీమిండియా కు లేవు ?

దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య త్వరలోనే క్రికెట్ సమరం జరగబోతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఇరు దేశాలు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు భారత్ పై విమర్శలు చేస్తూ... ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజగా పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఇండియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాక్ తో పోటీ పడే శక్తిసామర్థ్యాలు టీమిండియాకు లేవని అన్నాడు. భారత జట్టు కంటే పాక్ జట్టులోనే మంచి ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. ఈ కారణం వల్లే తమతో ఆడేందుకు ఇండియా ముందుకు రావడం లేదని తెలిపాడు.

భారత్, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగకపోతే అది క్రికెట్ ఆటకే మంచిది కాదని చెప్పాడు. పాకిస్థాన్ లో ఒత్తిడిని తట్టుకుని ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని... భారత్ లో లేరని అన్నాడు. ఇండియాలో మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ... పాక్ తో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉన్నారని రజాక్ చెప్పాడు. కపిల్ దేవ్ గొప్ప ఆటగాడు అయినప్పటికీ... ఆయనతో పోల్చితే ఇమ్రాన్ ఖాన్ నెంబర్ వన్ అని అన్నాడు. వసీం అక్రమ్ వంటి బౌలర్ ఇండియాలో లేడని చెప్పాడు.





Untitled Document
Advertisements