పరగడుపున నీళ్ళు తాగడం వలన ప్రయోజనాలు

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 04:04 PM

పరగడుపున నీళ్ళు తాగడం వలన ప్రయోజనాలు

పరగడుపున నీళ్ళు తాగడం వలన కలిగే అనేక ప్రయోజనాలలో కొన్నింటిగురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం .

*** జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
జీర్ణ వ్యవస్థలో రుగ్నతతో కొన్నిసార్లు కడుపులో యాసిడ్ లు విడుదల అవుతాయి. ఉదయం లేవగానే పరగడుపున నీళ్ళు తాగితే యాసిడ్ లు ఆ నీటిలో కరుగుతాయి. దీంతో దాని ప్రభావం తగ్గి గ్యాస్టిక్ సమస్యలు దూరమౌతాయి.

*** చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది:
నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గురివుతుంది. దీంతో చర్మం ముడతలు పడటంతోపాటు వయస్సు లో పెద్దవారిలా కనిపిస్తారు. అదే పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మాన్ని ఆరోగ్యాంగా మెరిసేలా చేస్తుంది.

*** జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతుంది :
గోరువెచ్చని నీరు తాగడం వల్ల సున్నితమైన , మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. జుట్టు కుదుళ్లను కుడా శక్తివంతంగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

*** వృద్ధాప్య ఛాయాలను అడ్డుకుంటుంది:
శరీరంలో ఉన్న టాక్సిన్స్ వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి. అయితే రోజు పరగడుపున గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల ఈ చర్య మందగిస్తుంది. దీంతో పాడాయిపోయిన మీ చర్మం సున్నితంగా , కాంతివంతంగా కనిపిస్తుంది.

*** ఆకలిని పెంచుతుంది:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తీసుకోవడం వల్ల మొత్తం శుభ్రం అవుతుంది . దీంతో త్వరగా ఆకలి వేసి టైం కి ఆహారం తీసుకునేందుకు దోహదపడుతుంది. ఒకవేళ మీరు కూడా ఆహార సమస్యతో భాదపడితే పరగడుపున నీరు తీసుకోండి.

*** అధిక బరువును తగ్గిస్తుంది :
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల అధిక బరువు ను తగ్గిస్తుంది.నీరు తాగడం వల్ల మెటబలిజం చర్యలు ఉత్తేజితమయి కొవ్వు ను కరిగిస్తాయి. దీంతో అధిక బరువు తగ్గవచని ఎన్నో అధ్యాయనాలలో రుజువైంది.

అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.





Untitled Document
Advertisements