కెనడాలో మెదడుకు అంతుబట్టని వ్యాధి...ఇప్పటికే ఆరుగురు మృతి

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 10:56 AM

కెనడాలో మెదడుకు అంతుబట్టని వ్యాధి...ఇప్పటికే ఆరుగురు మృతి

కెనడాలో అంతుబట్టని ఓ వ్యాధి (mystery illness) మెదడుకు సోకుతోంది. అది సోకిన వారు చనిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. కెనడాలోని న్యూ బ్రన్స్‌విక్ (New Brunswick) ప్రావిన్స్‌లో ఈ వ్యాధి సోకుతోంది. చనిపోయిన వారు కాకుండా మరో 48 మంది దీని బారిన పడినట్లు తెలిసింది.

వ్యాధి లక్షణాలు:

ఈ వ్యాధి ఏంటో డాక్టర్లకే తెలియట్లేదు. ఇధి సోకిన వారికి మతిమరపు వస్తోంది. బాగా అయోమయం చెందుతున్నారు. వాళ్లేం చేస్తున్నారో వాళ్లే అర్థం కావట్లేదు. స్థానిక ప్రభుత్వం హడావుడిగా దీనిపై పరిశోధన చేయిస్తోంది. ఇదో రకమైన మెదడులోని నాడులకు సోకుతున్న వ్యాధి (neurological syndrome)గా చెబుతున్నా... ఇప్పుడున్న వ్యాధుల్లో ఏదీ ఇలాంటిది లేదు. అందువల్ల ఇది కొత్త వ్యాధిగా భావిస్తున్నరారు. చనిపోయిన వారి వయసు 18 ఏళ్ల నుంచి 85 ఏళ్ల దాకా ఉంటుంది. అంటే అన్ని వయసుల వారికీ ఇది సోకుతోందని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని అదనపు లక్షణాలు:

మతిమరపు మాత్రమే కాదు... టెన్షన్, కళ్లకు మసక, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భావించడం (hallucinations), నొప్పి, మెమరీ సమస్యలు, క్రమంగా ఇవన్నీ వస్తూ... బ్రెయిన్ దెబ్బతింటోంది.

లోతుగా పరిశోధన:

కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ (PHAC) దీనిపై అలర్ట్ అయ్యింది. మెదడుపై పరిశోధనలు చేసే స్పెషలిస్టులు రంగంలోకి దిగారు. చనిపోయిన వారి మెదళ్లను పరిశీలిస్తున్నారు. ఒకేసారి ఇంత మందికి ఒకే ప్రాంతంలో వారికి ఈ కొత్త వ్యాధి ఎందుకు సోకిందన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్థానిక ప్రభుత్వమే ఆలోచించాలని PHAC అనడంతో... పేషెంట్ల రక్షణ సంస్థ బ్లడ్ వాచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. PHAC పూర్తి బాధ్యత తీసుకొని దీన్ని పరిశీలించాలని కోరుతోంది.

ప్రస్తుతం ఈ వ్యాధి సోకుతున్న న్యూ బ్రన్స్‌విక్ ప్రజలు... తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇది సోకుతోందో చెప్పాలంటున్నారు. కానీ ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇది అంటు వ్యాధా కాదా అన్నది కూడా తెలియట్లేదు. మన బాడీలో మెదడు అతి సున్నితమైనది కావడం వల్ల దానికి ఏ వ్యాధి సోకినా అంత ఈజీగా కనిపెట్టలేరు. అందుకే ఇది సమస్యగా మారింది. ఇప్పటికే కరోనాతో కలవరపడుతున్న ప్రపంచానికి కెనడా వింత వ్యాధి ఆందోళన కలిగిస్తోంది.

Untitled Document
Advertisements