కుబేర కుమారులకు శాపవిమోచనం కలిగించిన చిన్ని కృష్ణుడు!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 01:23 PM

కుబేర కుమారులకు శాపవిమోచనం కలిగించిన చిన్ని కృష్ణుడు!

గోపికల మాటలు విని కృష్ణుడు చేసే అల్లరిని భరించలేక, కృష్ణుడిపై  వచ్చే ఫిర్యాదులతో కోపోద్రిక్తురాలైన యశోద తాడుతో చిన్ని కృష్ణుని నడుము భాగాన్ని కట్టేసి, మరొక భాగాన్ని రోలుకు  కట్టింది. అప్పుడు చిన్ని కృష్ణుడు మెల్లగా రోలు ఈడ్చుకుంటూ పెరట్లో అంతా తిరిగాడు. ఆ పెరట్లో రెండు మద్ది చెట్లు ఉన్నాయి. కృష్ణుడు వాటి మధ్య నుంచి నడిచాడు. అప్పుడు రోలు వెళ్ళి ఆ చెట్లకు తగిలింది. అంతే ఆ రెండు చెట్లు ఫెళఫెళ విరిగిపోయాయి. వెంటనే అవి ఇద్దరు యక్షులుగా మారారు. వారిద్దరూ కుబేరుడి కొడుకులైన నలకూబర, మణికంథరులు. నారదుడి శాపం వల్ల మద్ది చెట్లుగా పడిఉన్నారు. కృష్ణుడు వారికి శాపవిమోచనం చేశాడు. వాళ్లు కృష్ణుని ఎన్నో విధాల ప్రార్ధించి వెళ్ళిపోయారు. చెట్లు విరిగిన చప్పుడుకు ఇంటిలోని వారంతా పరిగెత్తుకొచ్చి కూలిన రెండు చెట్ల మధ్యన కులాసాగా నవ్వుతున్న కృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు అందరూ.





Untitled Document
Advertisements