చలి జ్వరంతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 04:56 PM

చలి జ్వరంతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా జ్వరం వచ్చినప్పుడు విపరీతమైన చలి కూడా వేస్తూ ఉంటుంది. అటువంటి చలి జ్వరంతో బాధపడుతున్న వారి కోసం కొన్ని చిట్కాలు.
* రెండు తులాల తెల్లకాకర ఆకురసం లో బేడఎత్తు మిరియాల పొడి కలిపి రోజుకు రెండు పూటలా తాగుతూ ఉంటే నాలుగైదు రోజులలో చలి జ్వరం తగ్గుతుంది.
* బెల్లము, వాము వీటిని సమభాగాలుగా కలిపి ఉసిరికాయంత ఉండలు చేసి రోజూ ఉదయం సాయంత్రం ఒక్కొక్క ఉండ చొప్పున తింటూ ఉంటే రెండు వారాలలో జలి జ్వరం తగ్గుతుంది.
* పొద్దున్నే లేచి పళ్ళు తోముకుని కొంచెం పటికబెల్లం పొడిని తిని, ఒక జాజికాయలో నాలుగవ వంతు ముక్కను నమిలితిని నీళ్లు తాగకుండా ఒక గంట సేపు ఉండాలి. గంట తర్వాత నీళ్లు తాగవచ్చు ఇలా నాలుగైదు రోజులపాటు చేస్తే చలి జ్వరం మలేరియా జ్వరం తగ్గిపోతాయి.  దీనికి పత్యం ఏమీ అవసరం లేదు. ఇది చాలా ప్రసిద్ధమైన యోగము.
* అగ్ని వేండ్రపు చెట్టుఆకు పావు తులము, మిరియాలు 7 ఈ రెండింటినీ కలిపి చక్కగా నూరి చిన్న చిన్న గుళికలుగా చేసి పూటకొక్క మాత్ర చొప్పున రెండు రోజలు మంచి నీటితో తీసుకుంటే చలి జ్వరం తగ్గిపోతుంది.
* అడ్డరసపు వేర్ల పైపట్టు చూర్ణము పూటకు అణాఎత్తు నుండి బేడఎత్తు వరకు తేనెతో కలుపుకొని, రోజూ రెండు పూటలా తింటూ ఉంటే మలేరియా జ్వరం తగ్గిపోతుంది.





Untitled Document
Advertisements