దంతసమస్యల నుండి ఉపశమనం పొందండిలా!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 05:05 PM

దంతసమస్యల నుండి ఉపశమనం పొందండిలా!

కొంతమందికి బాగా చల్లగా లేదా వేడిగా ఉన్న పదార్థాలు  తిన్నా, తాగిన పంటినొప్పి వస్తుంది. ఇంకొంత మందికి గట్టిగా ఉండే పదార్థాలను కోరికినప్పుడు కూడా పంటినొప్పి వేధిస్తుంది. మరికొందరిలో చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు వాయడం ఇలా రకరకాల సమస్యలతో భాదపడుతూ ఉంటారు. అయితే పంటికి సంబంధించిన సమస్య ఏదైనా సరే ఆయుర్వేదంలోని ఈ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు.
* గైరికము, పటిక, ఏలకిగింజలు వీటిని సమభాగాలుగా కలిపి, నూరి రోజు పళ్ళు తోముకుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి.
* పటిక, కరక్కాయ పెచ్చులు, పుల్లదానిమ్మకాయ పెచ్చులు, సైoధవ  లవణము వీటిని సమభాగాలుగా తీసుకొని పొడిగా చేయాలి. ఈ  పొడితో రోజు పళ్ళు తోముతూ ఉంటే దంతవ్యాధులు తగ్గి పళ్ళు దృడంగా మారుతాయి.
* పొగడచెక్కను నలగ్గొట్టి కషాయము కాచి, ఆ కషాయాన్ని పుక్కిట పట్టి ఉమ్మేస్తే పళ్ళు ఎన్నటికీ ఊడకుండా దృఢంగా ఉంటాయి.
* తుమ్మచెట్టు పట్ట రెండుతులాలు, శొంఠి పావుతులము వీటిని కలిపి మెత్తగా నూరి భద్రపరుచుకోవాలి. ఈ పొడితో ప్రతిరోజు పళ్ళు తోముతూ ఉంటే కదిలే దంతాలు కూడా గట్టిపడి ఊడకుండా ఉంటాయి.
* నల్లనువ్వులు తిని, వెంటనే చల్లటి నీటిని తాగితే కదిలే దంతాలు కూడా బలంగా మారుతాయి.
* ఉత్తరేణి లేదా  మారేడు పుల్లలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు నశిస్తాయి.
* తేనే, ఉప్పు కలిపిన నిమ్మరసం రోజు తీసుకుంటే దంతవ్యాధులు నశిస్తాయి.
* పొంగించిన పటిక తులము, ఉప్పు తులము, అమృతధార 20 చుక్కలు వీటిని కలిపి పొడిగా నూరి సీసాలో పోసుకుని దీంతో ప్రతి రోజూ పళ్లు తోముకుంటే దంతవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ము నిప్పుల మీద కాల్చి పొడిచేసి ఆ పొడితో పళ్లు తోముకుంటే అన్ని రకాల  దంత వ్యాధులు నశిస్తాయి.





Untitled Document
Advertisements