నత్తి తగ్గించి, స్వరము స్పష్టంగా పలికించే చిట్కాలు!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 05:07 PM

నత్తి తగ్గించి, స్వరము స్పష్టంగా పలికించే చిట్కాలు!

కొంతమందికి మాట్లాడేటప్పుడు మాటల్లో తడబాటు, అక్షరాలు స్పష్టంగా పలకలేకపోవడం, నత్తి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అటువంటి వారి కోసం నత్తిని తగ్గించి, స్వరాన్ని స్పష్టంగా పలికించేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు.
* రాత్రి పడుకోబోయేటప్పుడు కొద్దిగా పటికను వేడి చేసి బుగ్గన పెట్టుకొని పడుకోవాలి. ఇలా నెలరోజులు కనుక చేస్తే నత్తితగ్గిపోయి మామూలుగా మాట్లాడగలుగుతున్నారు.
* పటికబెల్లం పొడి అరతులము, సరస్వతి ఆకుపావుతులం ఈ రెండింటినీ కలిపి పొడిగాచేసి ప్రతి రోజు ఉదయం సాయంత్రం మంచి నీటిలో కలుపుకొని కొద్దిరోజులు తాగుతూ ఉంటే నత్తి తగ్గిపోతుంది.
* ప్రతినిత్యము అక్కల కర్రను అరగదీసి నాలుకకు రాస్తుంటే నత్తి తగ్గుతుంది.
* వస ఐదుతులాలు, శొంఠి ఐదుతులాలు, పిప్పళ్లు ఐదుతులాలు సరస్వతి ఆకు పదిహేను తులాలు. వీటన్నింటిని కలిపి పొడిగా చేసి పూటకు పావుతులము పొడి చొప్పున తేనెలో కలిపి తీసుకుంటే నత్తి తగ్గిపోయి స్వరము చక్కగా పలుకుతుంది.
* సరస్వతి ఆకును ఎండబెట్టి పొడిచేసి మూడువేళ్ళతో పట్టుకోగలిగినంత పొడిని ప్రతిరోజు నాలుకపై రాస్తుంటే నత్తి తగ్గుతుంది.





Untitled Document
Advertisements