తెలంగాణలో తగ్గిన కరోనా!

     Written by : smtv Desk | Thu, Oct 14, 2021, 11:19 AM

తెలంగాణలో తగ్గిన కరోనా!

తెలంగాణలో తాజాగా 38,834 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వనపర్తి, ములుగు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,305 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,211 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,934కి పెరిగింది.

Untitled Document
Advertisements