ఇలా చేస్తే మృదువైన పాదాలు మీసొంతం!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 05:47 PM

ఇలా చేస్తే మృదువైన పాదాలు మీసొంతం!

దాదాపు శీతాకాలం వచ్చేసినట్టె అలాగే శీతాకాలంలో వచ్చే సమస్యలతో పోరాడడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు చిట్లిపోయి తెమకోల్పోవడం, చర్మం పోడిబారిపోవడం అలాగే పాదాలు పగుళ్ళు రావడం వంటి సమస్యలు మనల్ని వేదిస్తుంటాయి. అయితే జుట్టు, ఇంకా చర్మం విషయంలో జాగ్రత్త తీసుకునే మనం కాళ్ళని పెద్దగా పట్టించుకోము.
సరిగ్గా పట్టించుకోకపోతే పాదాల పగుళ్ళు, వాటి నుండి రక్తం కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి పరిష్కారానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి, శీతాకాలం లో కూడా మీ పాదాలను మృదువుగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోండి.

1. వారానికి రెండు రోజులు గోరు వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ నీటిలో మీ పాదాలను పది నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా డ్రై స్కిన్ ని స్క్రబ్ చేసేయండి.
2. స్క్రబ్ చేసిన వెంటనే ఏదైనా ఫుట్ క్రీం రాయండి. మీకు మరీ డ్రై స్కిన్ ఉంటే స్పెషలైజ్డ్ క్రీంస్ తీసుకోండి, ఇవి మామూలు వాటి కంటే థిక్ గా ఉంటాయి. అలాగే, రాత్రి నిద్ర కి ముందు ఫుట్ క్రీం అప్లై చేయడం అలవాటు చేసుకోండి.
3. మసాజ్ వల్ల డ్రై స్కిన్ కి మంచి జరగడమే కాక పాదాల అలసట పూర్తిగా పోతుంది, రిలాక్స్డ్ గా అనిపిస్తుంది, కొబ్బరి నూనె, నెయ్యి, బాదం నూనె, నువ్వుల నూనె వంటి వాటితో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి.
4. ఇంకా డ్రై హీల్స్ సమస్య తగ్గక పోతే పెట్రోలియం జెల్లీ యూజ్ చేయండి. ఇది పగిలిన పాదాలకి అద్భుతంగా పని చేస్తుంది. శుభ్రం గా ఉన్న పాదాలకి ఇది అప్లై చేసి సాక్స్ తో కవర్ చేయండి. ఇందు వల్ల మాయిశ్చర్ అక్కడే ఉంటుంది.

Untitled Document
Advertisements