శాకల్యుడి వలన కాశ్యపుడి పాపపరిహారం!

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 12:38 PM

శాకల్యుడి వలన కాశ్యపుడి పాపపరిహారం!

శాకల్యుడు గురు పరంపరలోని ఓ మహర్షి. ఇతడు వేద సంహితల్ని క్రమబద్దీకరించాడు. ఇప్పుడు ప్రసిద్ధమైన వేద సంహిత శాకల్యశాఖ అని పిలువబడుతుంది. పరీక్షిత్తు మహారాజుకు వైద్యం చేస్తానని తక్షకుని ధనం ఆశించి వంచించిన కాశ్యపుడ్ని ప్రజలు ఈసడించుకొనుచుండగా ఇతడు కాశ్యపుడ్ని గోదావరి, సరస్వతీ నదిల్లో స్నానం చేసి పాపపరిహారం చేసుకోమని సలహా ఇచ్చాడు శాకల్యుడు. ఆ తరువాత పోయిన ప్రతిష్ట కాశ్యపుడు తిరిగి పొందాడు. పరశువను రాక్షసుడు ఒకసారి బ్రాహ్మణ వేషము ధరించి శాకల్యుని ఆశ్రమమునకు వచ్చి ఆకలి అనగా అతను ఆహారం పెట్టగా ' ఈ అన్నము నాకు చాలదు. నేను రాక్షసుడను, నిన్ను కూడా తిని వేస్తాను' అన్నాడు. అది నీకు సాధ్యము కాదు. నన్ను బ్రహ్మాదిదేవతలు కాపాడుతున్నారని చెప్పినా వినక అతని పైకి రాబోగా ఆ రాక్షసునికి వేయి తలలు, రెండు వేల చేతులు కనిపించగా భయంతో నీవు సామాన్యుడు కావు, నన్ను రక్షించి, జ్ఞానము ప్రసాదించు అన్నాడు. అప్పుడు శాకల్యుడు నీవు గౌతమీ నది తీరమునకు వెళ్లి అక్కడ స్నానం చేసి సతీ మాతను ప్రార్థించుము అని చెప్పాడు.





Untitled Document
Advertisements