అందంగా కనిపించాలని క్రీములు రాస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 05:52 PM

అందంగా కనిపించాలని క్రీములు రాస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆడ, మగ అనేది సంబంధలేకుండా అందంగా కనిపించాలి అని ప్రతి ఒక్కరు ఆరాటపడుతూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలు ఫాలో అవుతూ అందానికి మెరుగులు దిద్దుకుంటే మరికొందరు మార్కెట్ ల్ దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించి అందాన్ని వారి అందాన్ని పెంచుకుంటారు. అయితే రెండు రకాల పద్దతులు మంచివే అయినా కూడా అన్ని పద్దతులు అందరికి సరిపడవు. కారణం ఒక్కొక్కరు ఒక్కో రకమైన శరీరతత్వం కలిగి ఉంటారు కాబట్టి.
కొందరి చర్మం జిడ్డు చర్మం అయితే కొందరి చర్మం డ్రై స్కిన్ అవుతుంది. మరి కొందరికి కాంబినేషన్ స్కిన్ కూడా అవ్వచ్చు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటంటే ఒకరు వాడుతున్నారు కదా అని మీరు కూడా అలాంటి ప్రొడక్ట్స్ వాడటం మంచిది కాదు. దీని వల్ల చర్మానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతీ ఒక్కరి చర్మం వేరు వేరు అయినప్పుడు అందరికీ ఒకటే పడతాయన్న గ్యారెంటీ లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా అని మీరు కూడా గుడ్డిగా ఫాలో అయిపోకండి.
ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పడవు. అటువంటి వాళ్లు మరింత ఎక్కువ ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే ప్రొడక్ట్స్‌ను ఉపయోగించాలి. అయితే మనకు ఎలా తెలుస్తుంది మనం ఉపయోగించే ప్రోడక్ట్ మనకి పడుతుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం పైగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని ఎలా వాడితే మంచిది అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అందుకని ఈ రోజు ఈ విషయాన్ని చెప్పడానికి నిపుణులు పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
మీరు ఒకే సారి మీకు నచ్చిన ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేయొద్దు. చర్మంపై అది ఎలా రియాక్ట్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి ఒక సారి ఒక ప్రోడక్ట్ మాత్రమే వాడండి. ఆ తర్వాత జాగ్రత్తగా ఫలితాలని పరిశీలించండి. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల రియాక్షన్ వచ్చేస్తుంది. దీంతో కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది కూడా. కాబట్టి నెమ్మదిగా ఒకసారి ఒక ప్రొడక్ట్‌ని మాత్రమే వాడండి. అదే మంచిది కూడా.
మీది ఏ స్కిన్ టైప్ అయినా సరే మొట్టమొదట మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు కొన్ని పదార్థాలు పడకపోవడం వల్ల రియాక్షన్ వస్తుంది. చర్మ సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ప్రోడక్ట్‌ని కొనుగోలు చేసిన తర్వాత దాని మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్‌ని పూర్తిగా చదవండి. లేదా ఎవరైనా ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ ఇచ్చినట్లయితే వాటిని కూడా ఒక సారి చూడండి.
అలా చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రోడక్ట్‌ని కొనండి. అది అయిపోయిన తర్వాత మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మీరు దీని కోసం కొద్దిగా ప్రోడక్ట్‌ని తీసి మీ మోచేతి మీద కానీ చేతి మీద కానీ అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత 24 గంటల పాటు ఆగాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన చోట బర్నింగ్ సెన్సేషన్ లాంటివి కలిగితే అది మీకు పడడం లేదు అని అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక దాని వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు అంటే వాడొచ్చు .
ఎప్పుడూ కూడా మీరు ప్రొడక్ట్స్ అప్లై చేసేటప్పుడు కొద్దిగా తీసుకుంటూ దాని యొక్క మోతాదును పెంచుకుంటూ రాయండి. అప్పుడే చర్మం లోపలికి ప్రోడక్ట్ వెళ్తుంది. చర్మానికి ఎప్పుడు కూడా మొదట క్లెన్సర్ తర్వాత టోనర్ ఆ తర్వాత సీరం ఆ తర్వాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లేదా నైట్ క్రీమ్ ఇలా ఒక ఆర్డర్ ఉంది. అలానే ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ కనుక ఏదైనా థిక్‌గా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసిన తర్వాత సీరమ్‌ని అప్లై చేస్తే ఫలితం వేరేగా వస్తుంది అని అంటున్నారు నిపుణులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.










Untitled Document
Advertisements