మైదాపిండి స్వచ్ఛమైనదా లేదా కల్తీ చేయబడిందా ..తెలుసుకొండిలా!

     Written by : smtv Desk | Sat, Oct 23, 2021, 11:54 AM

మైదాపిండి స్వచ్ఛమైనదా లేదా కల్తీ చేయబడిందా ..తెలుసుకొండిలా!

మనం వంట గదిలో ఎన్నో రకాల పదార్ధాలని ఉపయోగిస్తూ ఉంటాము. వంట చేయడానికి నిజంగా ఎన్నో ఆహార పదార్ధాలు ఉండాలి. అయితే మనం ఎప్పుడైనా గమనించినట్లయితే మన ఇంట్లో ఉపయోగించే కొన్ని సామాన్లు కల్తీ చేసి ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదు అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువులోను కల్తీ అనేది తప్పనిసరి అయిపోయింది. అటువంటి వాటిని మనం గమనించాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సింది మనమే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. మైదా పిండి, వరి పిండి వంటి వాటిలో కల్తీని ఎలా గమనించొచ్చు అనేది తెలియజేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం మైదా పిండిని కల్తీ చేయడానికి బోరిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తారు. దీంతో పిండి కల్తీ చేయబడుతుంది. అయితే మీరు ఉపయోగించే మైదా పిండి స్వచ్ఛమైనదా లేదా దానిని కూడా కల్తీ చేశారా లేదా అనేది ఇలా చూడచ్చు. మీరు ఉపయోగించే మైదాపిండి స్వచ్ఛమైనదా లేదా కల్తీ చేయబడిందా అనే అనుమానం మీకు కలిగితే ఈ చిన్న ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. మైదా పిండిని కల్తీ చేశారో లేదో తెలుసుకోవడం కోసం ముందు మీరు ఒక టెస్ట్ ట్యూబ్ ని తీసుకోండి. ఆ తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ లో ఒక గ్రాము మైదా వేయండి. ఇప్పుడు అదే టెస్ట్ బుక్ లో ఐదు మిల్లీ లీటర్లు నీళ్ళు వేయండి. ఇప్పుడు మీరు టెస్ట్ ట్యూబ్ ని జాగ్రత్తగా పట్టుకుని షేక్ చేయండి. ఇప్పుడు మీరు కొన్ని చుక్కల కాన్సెంట్రేటెడ్ హెచ్‌సిఎల్ వేయండి. ఇందులో ఒక టర్మరిక్ పేపర్ స్ట్రిప్ వేయండి.

మీరు టర్మరిక్ ప్రిపేర్ స్ట్రిప్ వేసిన తర్వాత రంగులో ఏ మార్పు లేదు అంటే కల్తీ చేయబడలేదు అని అర్థం. అదే ఒకవేళ కనుక ఎరుపు రంగులోకి అది మారిపోయింది అంటే మీరు వాడుతున్న మైదాని కల్తీ చేశారు అని అర్థం. కాబట్టి ఇలా ఈ చిన్న టెస్ట్‌తో మీరు మైదాని కల్తీ చేశారో లేదో తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ మధ్య కాలంలో నూనె, బటానీలని, కారం, పసుపు, మిరియాలు వంటి వాటిని కూడా ఎక్కువ కల్తీ చేస్తున్నారు. అటువంటి వాటిని కూడా మనం తెలుసుకుని వాటిని వాడకుండా దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైనా మీకు ఆహారం విషయంలో సందేహం కలిగితే తప్పక తెలుసుకోండి. అప్పుడే వాటిని ఉపయోగించండి లేదు అంటే అనవసరంగా ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది.





Untitled Document
Advertisements