డయాబెటిస్ పేషెంట్ పండ్లు అధికంగా తీసుకోవడం ప్రమాదమే!

     Written by : smtv Desk | Sat, Oct 23, 2021, 12:28 PM

డయాబెటిస్ పేషెంట్ పండ్లు అధికంగా  తీసుకోవడం ప్రమాదమే!

పండ్లు ప్రతి బ్యాలెన్స్డ్ డైట్‌లో ఒక మేజర్ కాంపొనెంట్‌గా వ్యవహరిస్తాయి. పండ్లలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్ల వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక వాటి కోసం చూస్తే.. పండ్లు తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుకోవచ్చు, హై బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, హెల్దీ బాడీ వెయిట్‌ను మెయింటైన్ చేయడంలో చాలా సహాయపడతాయి. అయితే పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ డైలీ లిమిట్ కంటే ఎంత ఎక్కువ తిన్నా ప్రమాదమే.
కొంత మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్న వాళ్ళని పరిశీలించిన దాని బట్టి దీనిని ఉద్దేశించారు. పండ్లని ఎక్కువగా తీసుకోవడం వల్ల లేదా కాన్సన్ట్రేట్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా హాని జరుగుతుంది మరియు అధిక చక్కెర స్ధాయి ఉన్న పండ్లు మరియు కార్బోహైడ్రేట్లను కలిపి తీసుకోవడం వల్ల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని తేల్చారు. డయాబెటిస్ పేషెంట్ ఈ విధంగా చేస్తే వారి ఆరోగ్యం పై ప్రభావం చాలానే ఉంటుంది అని చెప్పాలి. నిజానికి చక్కెరలో ఉండే ఫ్రక్టోస్ మరియు పండ్లలో ఉండే ఫ్రక్టోస్ ఈ రెండు ఒకటి కాదు అని గమనించాలి. కాకపోతే పండ్లలో ఉండే ఫ్రక్టోస్ అధిక శాతంలో తీసుకోవడం వల్ల కూడా ప్రమాదమే కాబట్టి పండ్లను కూడా బ్యాలెన్స్డ్ గానే తీసుకోవాలి. అధిక శాతం ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల కొన్నిరకాల వైటల్ ఆర్గాన్స్‌కు ప్రమాదం కలుగుతుంది. వాటితో పాటు అనారోగ్యం ఎక్కువ అవుతుంది.

లివర్ హెల్త్ :
లివర్‌లో ఎక్సెస్ ఫ్రూక్టోజ్ షుగర్ ఫ్యాట్ కింద మారుతుంది. ఈ ప్రక్రియను lipogenesis అని అంటారు. దాంట్లో భాగంగా ఫ్యాట్ మాలిక్యూల్స్ లివర్ లో ఎక్కుములేట్ అయిపోతాయి. ఇలా జరగడంతో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ( NAFLD ) వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో బాధ పడుతున్న వారు 25 శాతం మంది మరియు భారతదేశంలో 9 నుండి 32 శాతం మంది ఉన్నారు.
ఈ వ్యాధి ఎక్కువ మందిలో రావడానికి గల ప్రధాన కారణం హై ఫ్రక్టోజ్‌ను తీసుకోవడం వల్లనే. ఒక డైటరీ రిపోర్ట్ ప్రకారం 49 మంది NAFLD తో బాధపడుతున్న వారు ఇతరులు కంటే రోజుకు రెండు నుండి మూడు సార్లు డైటరీ ఫ్రక్టోజ్‌ను తీసుకుంటున్నారు. lipogenesis మాత్రమే కాక హై ఫ్రక్టోజ్‌ను తీసుకోవడం వల్ల లివర్ ఇంఫ్లమేషన్ మరియు లివర్ సెల్స్‌కు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంజురీ కూడా కలుగుతుంది.

బ్రెయిన్ హెల్త్ :
ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం హై ఫ్రక్టోస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ పై ప్రభావం తక్కువే. కాకపోతే చాలా తాజా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే షార్ట్ టెర్మ్‌లో ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్‌పై తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. అవే న్యూరో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు mitochondrial dysfunction. 2021 పరిశోధన ప్రకారం హై ఫ్రక్టోస్‌ను లాంగ్ టెర్మ్ లో తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ పై మరియు బ్రెయిన్ పనితీరు పై చాలా ముప్పు ఉంటుంది. ఎన్నో రకాల న్యూరోజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం లో చేసిన పరిశోధనల ప్రకారం శాస్త్రవేత్తలు ఈ విధంగా చెప్పారు. హై ఫ్రక్టోస్ తీసుకోవటం వల్ల వందలాది బ్రెయిన్ జీన్స్ డ్యామేజ్ అవుతాయి, డయాబెటిస్ నుంచి కార్డియో వాస్క్యులార్ డిసీజెస్ వరకు అన్ని వచ్చే అవకాశాలు ఎక్కువే, బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధులు అయితే అల్జీమర్స్ నుండి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వరకు అనేక వ్యాధులకు దారి తీస్తుందని తెలిపారు.

హార్ట్ హెల్త్ :
హై ఫ్రక్టోస్ డైట్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్ మరియు ఒబేసిటీకు దారితీస్తుంది. మనిషి బాడీ వెయిట్ ను రెగులైట్ చేసే హార్మోన్ లెఫ్టిఇన్. ఈ హార్మోన్ పై కూడా తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. దానివల్ల ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనిషి పై ప్రభావం చూపితే 2016 లో జంతువుల పై కూడా ఒక పరిశోధన చేశారు.
ఒక రెండు నెలలు హై ఫ్రక్టోస్ డైట్‌ను జీవులకు పెట్టడం వలన లివర్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్యుమిలేషన్ మరియు ఇంపైరెడ్ ఇన్సులిన్ ఫంక్షన్ జరిగింది. ఇదే కాదు చాలా రకాలుగా జంతువుల పై కూడా ప్రభావం చూపించినది. ఒబేసిటీ మరియు డయాబెటీస్ రావడం మాత్రమే కాదు. హై ఫ్రక్టోస్ డైట్ వల్ల బ్లడ్ లో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో బ్లడ్ ప్రెజర్ మరియు ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరిగిపోతాయి.

డైజెస్టివ్ డిజార్డర్ :
హై ఫ్రక్టోస్ డైట్ తీసుకోవడం వల్ల డయోరియా మరియు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో (IBS) బాధ పడాల్సి ఉంటుంది. IBS అనేది ఒక డైజెస్టివ్ డిజార్డర్ దీనివల్ల అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, డయేరియ వంటివి వంటి సమస్యలు వస్తాయి. సరైన జీర్ణప్రక్రియ జరగకపోవడం వల్ల, ఫ్రక్టోస్ అబ్సర్ప్షన్ జరుగుతుంది. దాంతో డయేరియా మరియు belching వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.















Untitled Document
Advertisements