మీ పెదవులు మృదుత్వాన్ని కోల్పోతున్నాయా.. అయితే ఇలా చేయండి

     Written by : smtv Desk | Mon, Oct 25, 2021, 12:56 PM

మీ పెదవులు మృదుత్వాన్ని కోల్పోతున్నాయా.. అయితే ఇలా చేయండి

కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం, పై
పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఎందుకు అవుతుంది అంటే శరీరంలో వచ్చిన మార్పులను వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు..
*  కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది దీనితో పెదవులు పొడిబారడం జరుగుతుంది.
* వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పులు పెదవులు భరించలేవు ఎక్కువ చలి, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమని కోల్పోయి పొడిబారతాయి.
* పని ఎక్కువైనందు వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే.
* లిప్స్టిక్ ల వల్ల ఇరిటేషన్ వచ్చిన కూడా పెదవులు పొడిబారి చిట్లుతాయి.
* ఏదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యలలో పెదవులు పొడిబారడం మొదటిది.

అయితే పొడిబారిన పెదవులకు సాంత్వన చేకూరాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... అవేంటో ఇప్పుడు చూసేద్దాం
* ఐదు మిల్లీలీటర్ల గ్లిజరిన్ లో అంతే మోతాదు నిమ్మరసం, పన్నీటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. పెదవులకు పట్టించి దానంతట అది ఆరే వరకూ అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లు అనిపిస్తే రెండు గంటలకోసారి కానీ ఉదయం రెండు సార్లు సాయంత్రం, రెండుసార్లు కానీ పట్టించవచ్చు. ఇవేవీ వీలు కానప్పుడు నీటితోనే మర్దనా చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.
*  చలికి పెదవులు చిట్లినప్పుడు వేడి నీటిలో దూదిని ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లి నట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే గ్లిజరిన్, వాజిలెన్, తేనే ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు.
* లిప్స్టిక్ కొనేటప్పుడు అందులో వాడినపదార్ధాల జాబితాను ఒకసారి సరి చూసుకోవడం తప్పనిసరి.
మాయిశ్చరైజర్ ఉన్న లిప్స్టిక్ నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్స్టిక్ లలో గ్లిజరిన్ తో పాటు యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి.





Untitled Document
Advertisements