మేకప్ తొలగించుకోండి ఇలా..

     Written by : smtv Desk | Mon, Oct 25, 2021, 12:57 PM

మేకప్ తొలగించుకోండి ఇలా..

ఏదైనా పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు మేకప్ చేసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అయితే పార్టీ నుంచి తిరిగివచ్చి మేకప్  తొలగించుకునే సమయంలో వెంటనే శుభ్రం చేసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇలా హడావిడిగా మేకప్ తొలగించుకోవడం వలన మేకప్  పూర్తిగా వదిలి పోకుండా చర్మంలోని రంధ్రాలు మూసుకుని పోయి చర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు గనుక సరైన పద్ధతిలో మేకప్  తొలగించుకుంటే మేకప్  పొరలన్నీ తొలగి, చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి... అయితే ఇప్పుడు మేకప్ సరైన పద్ధతిలో ఎలా తొలగించుకోవాలి అనేది తెలుసుకుందాం

మేకప్ తొలగించుకోవడానికి కావలసిన వస్తువులు:-
* ఐ మేకప్ రిమూవర్ లేదా బేబీ ఆయిల్
*  క్లెన్సర్
*  మాయిశ్చరైజర్
*  పెట్రోలియం జెల్లీ
*  ఫేస్ వాష్
కళ్ళమేకప్:- కళ్ళకు మేకప్ వేసుకునేటప్పుడు 'మస్కారా', ' ఐ ' షాడో, ' ఐ ' లైనర్ ను వాడతారు వీటిని శుభ్రం చేసుకోవడానికి కళ్ళు వాటి చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో దూదితో  'ఐ ' మేకప్  రిమూవర్ ను వాడాలి. మస్కారా బాగా శుభ్రపడేలా  జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రెగ్యులర్ మేకప్ రిమూవర్ కళ్లకు బాగా ఉండదు. రిమూవర్ వాడితే కళ్ళు వాపు వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి బేబీ ఆయిల్ కొన్ని చుక్కలు వేసుకుని మేకప్ ను శుభ్రం చేయాలి.
లిప్స్టిక్ :- లిప్స్టిక్ లు  పెదవులపై ఎక్కువసేపు నిలిచి ఉంటాయి. ఇలాంటప్పుడు లిప్ స్టిక్ ను తొలగించుకోవడానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించాలి. లిఫ్టిక్ తొలగించిన తర్వాత పెదవులు పొడిబారినట్లు అనిపిస్తే లిప్ బామ్  తప్పకుండా రాయాలి. లిప్ బామ్ తో పెదవులు కోమలంగా మారుతాయి.
ముఖం మేకప్:- కళ్ళు, పెదవులు శుభ్రం చేసుకున్న తర్వాత ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించడానికి చేతులతో ఫేస్ వాష్ ను ఉపయోగించి నెమ్మదిగా ముఖం కడుక్కోవాలి. దీంతో మేకప్ అంతా తొలగిపోతుంది చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి.
మాయిశ్చరైజర్ :- ముఖం కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.  మేకప్ ను హడావిడిగా తొలిగించుకోవద్దు. మేకప్ అంత తొలగించిన తర్వాత కళ్లపై చల్లని నీళ్ళు చల్లుకోవాలి.





Untitled Document
Advertisements