మిరియాల రసం రేసిప్..

     Written by : smtv Desk | Mon, Oct 25, 2021, 04:17 PM

మిరియాల రసం రేసిప్..

మిరియాల రసం ఒక దక్షిణ భారత వంటకంగా‌ అందరికీ తెలిసినదే. దీనిని రైస్ తోనే కాకుండా సూప్ గా‌ కూడా సిప్ చేయవచ్చు. జలుబు, దగ్గు‌ వంటి సమస్యలకు ఇది సరైన పరిహారంగా వాడుకలో ఉన్న ఉత్తమమైన వంటకం ఈ మిరియాల రసం. దీనిని వాడుక భాషలో మిరియాల చారు అంటారు. మిరియాల రసం రెసిపీ లేదా పెప్పర్ రసం రెసిపీని సులభంగా, త్వరగా తయారుచేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

2 టేబుల్ స్పూన్ మిరియాలు
1 కప్ తురిమిన టెంకాయ
2 టేబుల్ స్పూన్ మినపప్పు
2  ఎండు మిర్చి
అవసరాన్ని బట్టి ఉప్పు
అవసరాన్ని బట్టి నీళ్ళు
2 టేబుల్ స్పూన్ నెయ్యి
1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు
2 రెమ్మలు కరివేపాకు

దగ్గు, జలుబు దూరం చేసే మిరియాల రసం తయారీ విధానం :-
ఒక బాణలిలో నెయ్యి వేసి, కొద్దిగా వేడయ్యాక అందులో మిరియాలు, మినపప్పు వేసి, మినపప్పు గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి వాటిని మిక్సీలో వేసి పొడి చేయాలి.
అదే బాణలిలో కొంచెం నెయ్యి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. అందులో మిక్సీ లో వేసిన మిరియాల మిశ్రమాన్ని, కొబ్బరి తురుముని  వేసి కాస్త వేగాక అందులో నీళ్ళు పోసి ఉడకనివ్వండి.
రసం ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలపండి. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేయాలి. ఈ రెసిపీ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. జలుబు జ్వరం వంటి సమస్యలతో ఉన్నవారికి ఉపశమనం కోసం వినియోగించదగిన ఉత్తమమైన వంటకంగా సూచించబడుతుంది. పులుపు తినని వారికోసం ఇలా చేసుకోవచ్చు....మీరు కనుక పులుపు తింటే ఇక్కడ నీళ్లకు బదులుగా‌ వడకట్టిన చింతపండు, నిమ్మరసం కలిపిన నీటిని జోడించవచ్చు.





Untitled Document
Advertisements