మీ అందానికి మెరుగులుదిద్దుకొండిలా..

     Written by : smtv Desk | Mon, Oct 25, 2021, 04:38 PM

మీ అందానికి మెరుగులుదిద్దుకొండిలా..

చర్మాన్ని,శిరోజాలని సంరక్షించుకోవడానికి ఖరీదైన ఉత్పత్తుల్ని  కొనాల్సిన పనిలేదు. వంటగది అలమరల్లో, ఫ్రీజ్ లో ఉండే పదార్దాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు.
తేనే:-చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జిడ్డు చర్మం గలవారు గుడ్డులోని తెల్లసొన, తేనె కలిపి ముఖానికి మాస్క్ వేసుకోవచ్చు. పొడిచర్మం గలవారు పాలమీగాడలో తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఆగి కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
క్యాబేజీ:-క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. కొద్దిగా నీటిలో దానిని ఉడికించి, చల్లార్చి ఆ నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మెరుపులినుతుంది.
బాదం:- బాదం పప్పులో నీరు పోసి, వాటి పొర ఊడేంతవరకూ నాననివ్వాలి. వాటిని ఎండబెట్టి పొడి చేయాలి. ఓ సీసా లో ఆ పొడిని భద్రపరుచుకుని, రోజు కొద్దిగా పొడిలో పాలు కలిపి పేస్ట్ లా చేసి ముఖం మీద మృదువుగా రుద్దుకోవాలి. ఫేస్ ప్యాక్ లో కూడా ఈ పొడి కలుపుకోవచ్చు.
టీ:- వాడేసిన తేయాకును కొద్దిగా మీతిలో వేసి కాచి, నీటిని చల్లార్చి, తల స్నానం చేశాక చివరిగా ఆ నీటితో రుద్దుకుని కడిగేసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
నిమ్మ:- ఇది సహజమైన క్లెన్సర్, జుట్టు ఆయిలీగాఉంటే చివరిమగ్గు నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి జుట్టు కడుక్కోవాలి. నిమ్మరసం, పంచదారా కలిపి చేతులు రుద్దుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
పెరుగు:- తలస్నానానికి అరగంట ముందుగా పెరుగును తలకు పట్టించాలి.
ఉసిరి:- కొబ్బరినూనెలో ఉసిరి పొడి కలిపి వేడి చేయాలి. దానిని రెండు గంటల పాటు ఎండలో ఉంచి తలకు రాసుకుని, అరగంట ఆగి తలస్నానం చేయాలి.
పసుపు:- కొద్దిగా పాలలో పసుపు, చేనగపిండి కలిపి పేస్టులా చేసి చేతులు, కాళ్ళు రుద్దుకుని ఓ గంట ఆగి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
బంగాళదుంప:- బంగాళదుంప రసాన్ని కనుల చుట్టూ రాసుకుంటే ఉబ్బుగా అవడం తగ్గుతుంది.
కీరా:- కీరా రసాన్ని కళ్ళకింద నలుపు చారలపై రాసుకుంటే నలుపు తగ్గిపోతుంది.
ఆముదం:- కొద్దిగా ఆముదాన్ని కనురెప్పల మీద రాస్తుంటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా తయారవుతాయి.
చర్మాన్ని, శిరోజాలని సంరక్షించుకోవడానికి ఖరీదైన ఉత్పత్తుల్ని కొనాల్సిన పనిలేదు. వంటగది అలమరల్లో, ఫ్రీజ్ లో ఉండే పదార్దాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు.
తేనే:-చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జిడ్డు చర్మం గలవారు గుడ్డులోని తెల్లసొన, తేనె కలిపి ముఖానికి మాస్క్ వేసుకోవచ్చు. పొడిచర్మం గలవారు పాలమీగాడలో తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఆగి కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
క్యాబేజీ:-క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. కొద్దిగా నీటిలో దానిని ఉడికించి, చల్లార్చి ఆ నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మెరుపులినుతుంది.
బాదం:- బాదం పప్పులో నీరు పోసి, వాటి పొర ఊడేంతవరకూ నాననివ్వాలి. వాటిని ఎండబెట్టి పొడి చేయాలి. ఓ సీసా లో ఆ పొడిని భద్రపరుచుకుని, రోజు కొద్దిగా పొడిలో పాలు కలిపి పేస్ట్ లా చేసి ముఖం మీద మృదువుగా రుద్దుకోవాలి. ఫేస్ ప్యాక్ లో కూడా ఈ పొడి కలుపుకోవచ్చు.
టీ:- వాడేసిన తేయాకును కొద్దిగా మీతిలో వేసి కాచి, నీటిని చల్లార్చి, తల స్నానం చేశాక చివరిగా ఆ నీటితో రుద్దుకుని కడిగేసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
నిమ్మ:- ఇది సహజమైన క్లెన్సర్, జుట్టు ఆయిలీగాఉంటే చివరిమగ్గు నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి జుట్టు కడుక్కోవాలి. నిమ్మరసం, పంచదారా కలిపి చేతులు రుద్దుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
పెరుగు:- తలస్నానానికి అరగంట ముందుగా పెరుగును తలకు పట్టించాలి.
ఉసిరి:- కొబ్బరినూనెలో ఉసిరి పొడి కలిపి వేడి చేయాలి. దానిని రెండు గంటల పాటు ఎండలో ఉంచి తలకు రాసుకుని, అరగంట ఆగి తలస్నానం చేయాలి.
పసుపు:- కొద్దిగా పాలలో పసుపు, చేనగపిండి కలిపి పేస్టులా చేసి చేతులు, కాళ్ళు రుద్దుకుని ఓ గంట ఆగి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
బంగాళదుంప:- బంగాళదుంప రసాన్ని కనుల చుట్టూ రాసుకుంటే ఉబ్బుగా అవడం తగ్గుతుంది.
కీరా:- కీరా రసాన్ని కళ్ళకింద నలుపు చారలపై రాసుకుంటే నలుపు తగ్గిపోతుంది.
ఆముదం:- కొద్దిగా ఆముదాన్ని కనురెప్పల మీద రాస్తుంటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా తయారవుతాయి.

Untitled Document
Advertisements