భోజనానికి ముందు ఇలా చేయడం వలన బరువు తగ్గొచ్చట!

     Written by : smtv Desk | Wed, Oct 27, 2021, 02:03 PM

భోజనానికి ముందు ఇలా చేయడం వలన బరువు తగ్గొచ్చట!

బరువు, లావు తగ్గడానికి ఏం చేయాలి అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తున్న అతి పెద్ద అంశం. అయితే మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు గనక చేసుకున్నట్లయితే సులభంగా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజూ భోజనానికి ముందు సలాడ్లు తింటే మంచి ప్రయోజనం ఉంటుంది ఉంటుంది అన్నది తాజా పరిశోధనల సిఫార్సు.
ఊబకాయం తగ్గడానికి ఏం తినాలి? ఎలా తినాలో నిర్దేశిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నో రకాల ఆహార విధానాలు ( డైట్స్ ). ఎంతో మంది స్వయం ప్రకటిత ప్రత్యేక నిపుణులు (డైట్ గురూస్ ) పుట్టుకొస్తున్నారు. అయితే వీళ్లలో ఏ ఇద్దరు సూచించే అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు. ప్రతి దాని పైన బోలెడు వివాదాలు. వీటన్నింటికీ దూరంగా ఏ వివాదాలు లేని చిన్న చిట్కా ఒకటి చెబుతున్నారు అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వాళ్లు. అదేంటి అంటే.... రోజు భోజనం చేసే ముందు ఒకటి రెండుసార్లు సలాడ్లు తీసుకోవాలి. అంటే క్యారెట్, బీట్రూట్, ఉల్లి, టమాటో, ముల్లంగి, క్యాబేజీ వంటి కొన్ని పచ్చి కూర  ముక్కలు మొలకెత్తిన పెసలు, శనగలు వంటి గింజలు తీసుకోవాలి. ఇలా ఒకటి రెండుసార్లు సలాడ్లు తీసుకుంటే ఆ తర్వాత సహజంగానే మనం తీసుకునే ఆహారం పరిమాణం తగ్గిపోతుంది. దీంతో రోజుమొత్తంమీద మనం తీసుకునే ఆహార పరమైన క్యాలరీలు గణనీయంగా తగ్గుతాయి. తర్వాత ఒక గాయానికి కారణమయ్యే కొవ్వు, చక్కెరలు కూడా బాగా తగ్గుతాయి. ఇలా కొద్ది నెలల పాటు చేస్తే క్రమేపీ బరువు తగ్గే వీలుంటుందని 'జర్నల్ ఆఫ్ అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్' లో వివరించారు.





Untitled Document
Advertisements