అధిక రక్తపోటు అదుపులో ఉంచుకొండిలా!

     Written by : smtv Desk | Wed, Oct 27, 2021, 02:04 PM

అధిక రక్తపోటు అదుపులో ఉంచుకొండిలా!

ప్రస్తుతం ప్రతి పదిమందిలోనూ ఎనిమిది మంది షుగర్ బీపి కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదని, కొవ్వు తక్కువ తినాలని ఇలా అధిక రక్తపోటు ఉన్న వారికి ఆహారం విషయంలో ఎన్నో నియంత్రణలు. ఇవన్నీ ఏం తినకూడదో చెప్పేవి. అయితే ఇటీవల వీళ్ళు ఏం తినాలో చెబుతూ ఒక అధ్యయనం వెలువడింది. ఆ అధ్యయనం ప్రకారం ఇలా అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ రోజు వారి పండ్లు, ఫలాలు, కూరగాయలు ఎక్కువగా తింటే రక్తపోటు చక్కగా అదుపులోకి వస్తుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు.
ఆయా కాలాల్లో సహజంగా లభించే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటూ.. ఉప్పు, కొవ్వు పదార్థాలు కాస్త తగ్గించి తింటూ రోజువారీ వ్యాయామం చేస్తున్న వారికి పూర్తిగా మందుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా రక్తపోటు అదుపులోకి వస్తుందని వీరు గుర్తించారు. నిత్యం ఈ పద్ధతులన్నీ క్రమం తప్పకుండా పాటించిన వారిపై వీరు అధ్యయనం చేయగా దాదాపు 35 శాతం మందిలో ఆరు వారాలు తిరిగేలోపు బరువు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. వీరంతా రోజుకో ఏవైనా మూడు పళ్ళు, అన్ని పచ్చి కూరగాయలు తినడం ద్వారా ఈ సత్ఫలితాలను సాధించగలిగారు అని పరిశోదకులు వివరించారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఇక బీపీ టాబ్లెట్ కి గుడ్ బై చెప్పేసి ఈ పద్ధతిలోని ఫాలో అయిపోయి మీకున్న హైబీపీని కంట్రోల్ లోకి తెచ్చుకోండి.





Untitled Document
Advertisements