ఆకుకూరలతో ప్రయోజనం!

     Written by : smtv Desk | Thu, Oct 28, 2021, 04:33 PM

ఆకుకూరలతో ప్రయోజనం!

ఆకుకూరల్లో అపార పోషక విలువలు ఉన్నాయి. మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజలవణాలు, విటమిన్లు, క్యాల్షియం, సి, ఏ విటమిన్ లు అధికంగా ఉన్నాయి. అపార పోషకాలు ఉన్నందువల్లే ఆకుకూరలు మన ఆరోగ్యంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. మనకు సాధారణంగా లభ్యమయ్యే వాటిలో తోటకూర, గోంగూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, మెంతికూర, పొన్నగంటికూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఉండే పోషక విలువలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
* రక్తం అభివృద్ధి చేసి రక్తహీనత లేదా పాండురోగం రాకుండా కాపాడుతాయి.
* గుండె, మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు  మంచి రక్తాన్ని అభివృద్ధి చేస్తాయి.
* ఎముకలు, దంతాలు గట్టిపరిచే పోషకాలైన ఇనుము, సున్నం,  విటమిన్ సి అధికంగా లభిస్తాయి. ఆకు కూరలు ఆహారంలో చేరిస్తే ఎముక పుష్టి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* తరుచూ రొంప, జ్వరం మొదలగు వ్యాధులకు గురికాకుండా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్థాయి ఆకుకూరలు.
* ఆకుకూరల్లోని పీచుపదార్థం అన్నవాహిక కదలికలను పెంచే ఆహారం త్వరగా జీర్ణమై మలబద్ధకం రాకుండా కాపాడుతాయి.
ఒక వంద గ్రాముల తోటకూర లో 25 మిల్లీ గ్రాముల కాల్షియం  లభిస్తుంది. ఈ కనీసం శరీరానికి రక్తపుష్టిని చేకూరుస్తుంది. తోటకూర లో విటమిన్ - ఏ ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. 100 గ్రాముల తోటకూరలో  5,525 మైక్రోగ్రాముల విటమిన్ - ఏ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి కంటిచూపును పెంపొందిస్తుంది. రాకుండా కాపాడుతుంది.
సంవత్సరమంతా అందుబాటులో ఉండే కరివేపాకులో అత్యధికంగా కాల్షియం  లభిస్తుంది. 100 గ్రాముల కరివేపాకులో 830 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కరివేపాకు నువ్వు report లలోనే కాకుండా పచ్చడి, కారం పొడి రూపంలో చేసుకొని ఆహారంలో తీసుకోవచ్చు. కాల్షియం దంతాలు ఆరోగ్యంగా గట్టిగా ఉంచి ఎముకలు పుష్టిగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
అదే విధంగా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే 100 గ్రాముల  మునగాకులో 220 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని చేకూరుస్తుంది. సాధారణంగా మునగాకు అధిక పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ ఆహారంలో తీసుకోరు. లేదా మునగ ఆకులు పప్పుతో కలిపి వండి అందులో చింతపండు రసం బదులుగా నిమ్మరసం పిండి పోపు పెట్టి ఆహారంలో తీసుకుంటే ఎక్కువ బలాన్ని పొందవచ్చు.
ఇవే కాకుండా ఆకుకూరలను వండే విధానంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే వాటిలోని పోషకాలు యధాతథంగా మన శరీరానికి అందుతాయి.
వంట చేసే పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల పోషక విలువలు నష్టపోతాయి. కొత్తిమీర, పుదీనా మొదలగు ఆకుకూరలతో పచ్చడి తయారు చేసేటప్పుడు కొత్తిమీరను, పుదీనాను వేప కూడదు తాజా ఆకును వాడాలి. వేపడం వల్ల వాటిలోని పోషకవిలువలు నశించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆకుకూరను మొదట ఎక్కువ నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా తరగాలి. ముందు ముక్కలు తరిగిన తర్వాత కడగడం వల్ల విటమిన్లు నీటిలో కరిగి వృధా అయిపోతాయి.





Untitled Document
Advertisements