పుదీనాలోని ఔషధ గుణాలు!

     Written by : smtv Desk | Thu, Oct 28, 2021, 04:35 PM

పుదీనాలోని ఔషధ గుణాలు!

సాధారణంగా పుదీనాను వంటలలో సువాసనకోసం వాడుతూ ఉంటారు. ఈ పుదీనాని అదనంగా వంటలలో చేర్చడం వల్ల వంటకానికి రుచి, సువాసన చేకూరుతాయి. అయితే పుదీనా వంటకాలకు సువాసనను మరియు రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైనది. పుదీనా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది అని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇటువంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన పుదీనాలో ఉన్న మరెన్నో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు.
* అజీర్ణం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను నూరి కషాయం కాచి అందులో నిమ్మరసం తగినంత వేసి తాగితే గుణం కనిపిస్తుంది.
* పుదీనా ఆకులను ఇతర ఆహార పదార్థాల తయారీలో అంటే కూరలు పచ్చళ్ళు వంటి వాటిల్లో జతచేసి తీసుకుంటే రక్తహీనత, నరాలు, ఎముకల బలహీనత రాకుండా కాపాడుతాయి.
* ఆడవారు, గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో 1.55% ఐరన్, 2% కాల్షియం, 8.4% గంధకం అందువల్ల శరీరవృద్ధికి, మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంటిలోనే గంధకం చర్మానికి రక్షణ ఇస్తుంది.
* మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తరచూ తీసుకుంటే బీటా కెరోటిన్ సమృద్ధిగా లభ్యమవుతాయి.
* గుండె జబ్బు గల వారికి పుదీనా మేలు కలిగిస్తుంది. దీనిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉన్నందున ఇది జీర్ణశక్తికి మంచి చేస్తుంది. అందువల్ల దీనిని విధిగా తీసుకోవడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు.
* వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిముషాల పాటు ఉంచుకుని కడిగేస్తే చుండ్రు పోతుంది.
* తల నొప్పిగా ఉంటే పుదీనా పేస్టు ని మొదట పూసుకుని 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల తల చల్లబడి తలనొప్పి తగ్గిపోతుంది.
* ఒక కప్పు పుదీనా ఆకులను రెండు కప్పుల నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లబడుతుంది.





Untitled Document
Advertisements