ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని టిప్స్!

     Written by : smtv Desk | Thu, Oct 28, 2021, 04:36 PM

ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని టిప్స్!

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మజిల్ టిష్యూ లు కోల్పోయి, శరీరంలో మెటబాలిజం శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే దీనికి అనుగుణంగా శరీరం యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది. అయితే శరీరం యొక్క మెటబాలిజం పెంపొందించుకోవడానికి, శరీరం యొక్క బరువు తగ్గించుకోవడానికి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది.  అయితే ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి బాడీని బాగా కష్టపెట్టకుండా ట్రైనర్ చెప్పిన విధంగా చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
* ఒక వారంలో 30 నిమిషాలు నాలుగు సార్లు ఏరోబిక్స్ చేయడం చాలా మంచిది.
* నిదానంగా అరగంట నుండి రోజూ కొంత సమయం పెంచుకుంటూ వెళ్లితే శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. దీని వలన క్యాలరీస్ కరిగి బాడీ లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది.
* ఏరోబిక్ యాక్టివిటీ ట్రైనింగ్ లో సైకిలింగ్,రోలర్ స్కేటింగ్, బ్రిస్క్ వాకింగ్,  ఏరోబిక్స్, స్విమ్మింగ్, జాగింగ్, టెన్నిస్ వంటి వాటిలోనుంచి  ముందుగా ఫిట్నెస్ పెంచడానికి ఈ వాకింగ్ నుంచి లైట్ ఎక్సర్సైజ్ చేయిస్తారు. వాటిల్లో సైక్లింగ్, జాగర్, హిప్ రొటేషన్, వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వీటికి ఒక గంట సమయం పడుతుంది. ఏ ఎక్సర్సైజ్ అయినా ఒకేసారి ఎక్కువగా చేయకుండా మెల్లగా పెంచుతూ పోవాలి.
ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని టిప్స్
* ఉదయం వాకింగ్ కి వెళ్లడం చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన బాడీ నాచురల్  వెయిట్ రిడక్షన్ కి ఉపయోగపడుతుంది.
* ముందుగా ఎక్సర్సైజులు 20 నిమిషాల నుండి మొదలుపెట్టి మెల్లగా టైం ను పొడిగిస్తూ వెళ్ళాలి.
* ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్  కొనుక్కొని వాటిని పెట్టడానికి ప్లేస్ లేక ఇబ్బంది పడటం కన్నా జిమ్ కి వెళ్లడం అలవాటు చేసుకుంటే మంచిది.
* సర్ ప్రైజ్ ఏరోబిక్స్ వంటివి చేయడం, డైట్ కంట్రోల్ చేస్తున్నప్పుడు మల్టీ విటమిన్ తీసుకోవడం ఎటువంటి అనారోగ్యం దరిచేరకుండా  బాడీ ఫిట్నెస్ సొంతం చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements