సన్నగా ఉన్నవారికి ఈ డ్రెస్స్ లు బెస్ట్!

     Written by : smtv Desk | Thu, Oct 28, 2021, 04:37 PM

సన్నగా ఉన్నవారికి ఈ డ్రెస్స్ లు బెస్ట్!

కొంతమంది మరీ సన్నగా వెదురు పుల్లకు  దుస్తువులు వేసినట్టుగా ఉంటారు. వంటి వారు ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్నా సరే ఆకర్షణీయంగా కనిపించలేరు. కారణం వారి శరీరం అలా ఉండడమే. అయితే ఇటువంటి వారు ఈ కింది విధంగా పాటించగలిగితే అందంగా కనిపించవచ్చ.
* సన్నగా ఉన్నవారు ఎక్కువగా కాటన్, కోటా వంటి స్టిఫ్ గా ఉన్న వస్త్రాలను ఎంచుకోవాలి.
* పెద్ద పువ్వులు ఉన్న డ్రెస్సులను సెలెక్ట్ చేసుకోవడం వలన మరీ సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపిస్తారు.
* అకేషన్ టైంలో శారీని బ్యూటీషియన్ సలహాపై ధరించడం వలన మీ శరీరాకృతికి  మంచి అందం వస్తుంది.
* చామనచాయ రంగు ఉన్నవారు మరి డార్క్ కలర్స్  లేదా మరి లైట్ కలర్ ప్రిఫర్ చేయకూడదు.
* చామనఛాయ కన్నా కొంచెం రంగు ఉన్నవారు డార్క్ కలర్స్ వేసుకోవడం వలన అందంగా కనిపిస్తారు.
* ఎవరైనా శారీని కట్టినప్పుడు హిల్స్ ధరించడం వలన లుక్ మరింత పెరిగే అవకాశం ఉంది.
* శారీ కింద పెట్టికోట్ కాలి మడమల కింద వరకు ఉండేలా చూసుకోవాలి.
* పల్చటి శారీ కట్టినప్పుడు సారీ కింద పెట్టి కోర్టు కొంచెం ఫ్రీగా ఉండడం వలన చుట్టుకునిపోకుండా నీట్ గా ఉంటుంది.
* కాటన్ దుస్తులు కొంచెం లూజుగా మరియు కొద్దిగా పొడవుగా ఉన్నవి ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే అవి ఒకసారి ఉతికిన తరువాత కొద్దిగా షింక్ అవుతాయి కాబట్టి కొంచెం లూజుగా ఉన్నవి తీసుకోవాలి.
* చేతులు సన్నగా ఉన్నవారికి షర్ట్ మరియు మెగా స్లీవ్స్ మంచి లుక్ ఇస్తాయి.
* మరి ఈ ఫ్యాషనబుల్ అని ట్రెండింగ్ అని ఏదంటే ఆ డ్రెస్ వేసుకో కూడదు. వేసుకునే ముందు అది మన శరీరాకృతికి నప్పే విధంగా ఉంటుందా లేదా అని ఆలోచించాలి.
* ఏ సీజన్లో ధరించవలసిన దుస్తులు ఆ సీజన్లో ధరించాలి.
* డ్రెస్స్ వేసుకున్న తర్వాత బ్రాస్ట్రాప్స్  బయటకి కనబడకుండా పిన్ పెట్టుకోవాలి. కుదిరితే డ్రస్స్టిచ్ చేయించుకునేటప్పుడు బ్రా బటన్స్ కుట్టించుకుంటే మరీ మంచిది.
* మీరు వేసుకునే డ్రెస్ రంగును బట్టి అండర్గార్మెంట్స్ ధరించాలి.





Untitled Document
Advertisements