నవ్వుతో ఆరోగ్యం?

     Written by : smtv Desk | Sat, Oct 30, 2021, 03:01 PM

నవ్వుతో ఆరోగ్యం?

చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఉండడం కూడా అదృష్టమే. నిజానికి నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు నాడు. మరి నేడు నవ్వు యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసి నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్నారు. కారణం నవ్వితే అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా ఉండోచ్చు అని. ఏవిధంగా అంటారా? అయితే ఆలస్యమెందుకు చదివేయండి.
* మనస్సును ఆనందంతో ముంచెత్తి గుండె బలంగా, ఆరోగ్యంగా పనిచేయటానికి, రోజంతా ఉత్సాహంగా గడపటానికి నవ్వు నాలుగు విధాల లాభం అంటున్నారు మన శాస్త్రవేత్తలు.
* రోజు మొత్తంలో వీలైనన్నిసార్లు సహజంగా నవ్వగలిగి శక్తిని పెంచుకుంటే మంచిదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
* జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, హార్మోన్ల పునరుద్దరణకు, రక్త ప్రసరణకు, రోగనిరోధక శక్తి పెరగడానికి నవ్వు చాలా ఉపయోగపడుతుంది.
* మన శరీరంలోని అంగాలకు నవ్వు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే ఈ నవ్వుల క్లాసులు, వింత అరుపులు, చిత్ర విచిత్ర ప్రదర్శనలు అంతా పిచ్చి నవ్వే.
* నవ్వు అందాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యాన్ని తెల్పుతుంది. వయస్సు మళ్ళిన మానసిక, శారీరక ఉత్సాహం ఏమాత్రం తగ్గని మగువల రహస్యం వారు చిందించే నవ్వే.





Untitled Document
Advertisements