నెలసరినొప్పి నుండి ఉపశమనం పొందండిలా!

     Written by : smtv Desk | Sat, Oct 30, 2021, 03:04 PM

నెలసరినొప్పి నుండి ఉపశమనం పొందండిలా!

చెరుకురసం దిన్ని ఇష్టపడని వారు ఉండరు.... చల్లటి చెరుకు రసం లో నిమ్మరసం, కాస్త ఉప్పు కలిపి తాగితే ఆ రుచే వేరు. వేడి ఎక్కువగా ఉండే ఎండాకాలం చెరుకు రసం తాగడం అంటే అందరికి ఇష్టమే. వేసవి కాలం ఎండతీవ్రతకి బాడి త్వరగా డిహైడ్రేట్ అవుతుంది. అటువంటప్పుడు మీకు డీహైడ్రేషన్ కలిగిన లేదా కొంచెం అలసట అనిపించినా ఒక పెద్ద గ్లాసు చెరకు రసం తాగండి. అయితే, చెరకు రసాన్ని మధ్యాహ్నం తీస్కోండి. ఈ చెరకు రసాన్ని మీరు వారంలో మూడు సార్లు తీసుకుంటే చాల మంచిది. ఎందుకంటే ఇది సహజ డిటాక్స్‌గా ఉపయోగపడుతుంది. ఇది సహజ శీతలకరణి అయితే ఇది శీతాకాలం సీజన్‌లో కూడా వస్తుంది. కాకుంటే చాల మంది ఎండాకాలం లో నే చెరకు రసం తాగడానికి చాల ఇష్టపడతారు.
చాలా వరకు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో చెరకు అలాగే దాని ఉత్పన్నాలను ఉపయోగిస్తారు. ఇది వేసవి కాలంలో వచ్చే పంట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, సూక్ష్మ ఖనిజాల స్టోర్ హౌస్. అందుకే చెరుకు రసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఇది డ్యూరెటిక్ వలే పని చేస్తుంది , మీ బాడీలో ఉబ్బరాన్ని, అలసటను తొలగిస్తుంది. అలాగే మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడ్తుంది.
ఇది తాగితే మీ కాలేయ పనితీరు ఆప్టిమైజ్ అవుతుంది. కామెర్ల చికిత్సలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
మీకు గనక స్మూత్, మృదువైన చర్మం కావాలనుకుంటే చెరుకు రసాన్ని తాగండి. ఇది తాగితే మీకు మృదువైన చర్మం కలుగుతుంది అలాగే మొటిమలని పూర్తిగా నివారిస్తుంది. ఇది మీ జుట్టు లో ని చుండ్రును కూడా పోగొడుతుం.
మలబద్ధకాన్ని దూరం తీస్తుంది.
ఇది సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్. అలాగే కొత్తగా తల్లి ఐన వాళ్లలో పాల ఉత్పత్తి ని అలాగే స్పెర్మ్ యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
శీతాకాలంలో చాల మంది నీరు తాగటం మర్చిపోతారు. ఇలాంటి సందర్భాలలో చెరకు రసం తీస్కోడం చాల ఉపయోగకరం. మీరు ప్రతి రాత్రి తరచుగా మేలుకునే రకం మనుషులు గనుక అయితే, ప్రతి ఉదయం మీరు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే ఒక గ్లాసు చెరకు రసం తీస్కోండి. మీకు అది రుచికరం అన్పించి ఎంతో ఉత్సాహంగా ఉండే లా ఫీల్ అవతారు.
మీరు గనుక పీరియడ్స్‌తో బాధపడుతున్నపుడు మీకు విపరీతమైన కడుపు నొప్పి కలుగుతుంది. పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరకు రసాన్ని వాడొచ్చు. ఇందుకోసం మీకు పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు చెరుకు రసం తాగితే అది మీకు ఈ పీరియడ్ నొప్పి నుండి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.
కొంత మందికి చెరుకు రసం అందుబాటులో ఉండదు. వారు చెరకురసం బదులు ఆమ్లా షర్బత్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇవి కొన్ని చెరకు రసం వాళ్ళ మీకు కలిగే ప్రయోజనాలు. చెరకు రసం రుచిని పిల్లలతో పాటు పెద్దలు ఎంతో ఆస్వాదిస్తారు. ఈ జ్యూస్ చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.





Untitled Document
Advertisements