అల్లంతో వంటలకు రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా మీసొంతం!

     Written by : smtv Desk | Sat, Oct 30, 2021, 03:07 PM

అల్లంతో వంటలకు రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా మీసొంతం!

ప్రతి చిన్న అనారోగ్యానికి మెడికల్ షాప్ వైపు చూడకుండి. ఒకసారి మీ వంటింటి వైపు చుడండి. మీ వంటిల్లె ఓ ఔషదాలయం అని గుర్తుంచుకోండి. మీ వంటింటి ఔషదాల్లో అల్లం కూడా ఒకటి. అల్లం కూరలకు రుచి మాత్రమే కాదండోయ్.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే రోజువారీ ఎదుర్కొనే అనేక శరీరక సమస్యలను సైతం అల్లం తొలగిస్తుంది. అల్లం మంచి యాంటిఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా తోడ్పడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అల్లం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయి? ఏయే సమస్యలకు ఎలాంటి చిట్కా పాటిస్తే ప్రయోజనం ఉంటుందో చూడండి.
❤ అల్లాన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
❤ అల్లం వల్ల కడుపులో పూత(అల్సర్) ఏర్పడదు.
❤ అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.
❤ డయాబెటీస్‌ను నియంత్రించే శక్తి సైతం అల్లానికే సొంతం.
❤ అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసం తాగితే ఉపశమనం కలుగుతుంది.
❤ అల్లం ఎలర్జీలను నివారిస్తుంది.
❤ కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది.
❤ దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పని చేస్తుంది.
❤ ఆస్తమా, బ్రొంకైటిస్ దగ్గుని కూడా నివారిస్తుంది.
❤ ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
❤ జీర్ణక్రియ సమస్య ఉన్నట్లయితే కాస్త అల్లం తీసుకోండి. అంతా సాఫీగా జరిగిపోతుంది.
❤ దగ్గు వేదిస్తుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోండి.
❤ అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న విషతుల్యాలను తొలగించి ఉపశమనం కలిగిస్తాయి.
❤ కానీ, అల్లం తక్కువ పరిమాణంలోనే తినాలి. ఎక్కువ తింటే కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.





Untitled Document
Advertisements