ఇలా చేస్తే చలికాలంలోను నిగారింపు మీసొంతం!

     Written by : smtv Desk | Tue, Nov 02, 2021, 03:15 PM

ఇలా చేస్తే చలికాలంలోను నిగారింపు మీసొంతం!

చలికాలంలో చర్మానికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. పెదవులు పగలడం, ముఖం పొడిబారిపోవడం, చేతులు కాళ్లు పగిలి గరుకుగా తయారవడం వంటివి జరుగుతూ ఉంటాయి. చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు పాటించక తప్పదు. అయితే అవేంటో చూద్దాం..
* మామూలుగా ఆయిల్, నార్మల్, డ్రైస్కిన్ అని మూడు రకాలుగా చర్మం ఉంటుంది. ఎవరి చర్మతత్వానికి తగ్గట్టుగా వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
* ఆయిల్ స్కిన్ వాళ్లకి ఉదయం నిద్రలేవగానే చర్మం టైట్ గా అనిపించి పొడిబారినట్లు ఉంటుంది. అలాంటప్పుడు నాన్ ఆయిలీ మాయిశ్చరైజర్ వాడాలి. వీరు నూనెతో కూడిన ఏ పదార్థం ముఖానికి పట్టించకూడదు. అలాగే సున్నిపిండి,  శెనగపిండి స్నానానికి వాడాలి.
* చలికాలంలో చిన్న పెద్దా అందరూ కూడా మాయిశ్చరైజర్, నరిషింగ్ క్రీమ్ వాడితే చర్మం మెత్తగా ఉంటుంది.
* ఈ కాలంలో వేడి నీళ్ళు పోసుకోవాలి అనిపించినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. వీడి మీరు గనక స్నానానికి ఉపయోగిస్తే చర్మానికి హాని జరిగే అవకాశం ఉంది.
* రోజు రాత్రి మాయిశ్చరైజర్ అప్లై చేసి ఉదయాన్నే స్నానం చేస్తే శరీర లావణ్యం చెక్కుచెదరదు.
* చలికాలంలో కోల్డ్ క్రీమ్ వాడటమే ఉత్తమం. పౌడర్లు వేరే బ్యూటీ క్రీమ్ లు తగ్గించాలి.
* ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పెదవులపై వెన్న అప్లై చేస్తే పెదవులు పగలవు. పైగా మృదువుగా మారతాయి.
* పొలం దుస్తువులు వాడితే చర్మం చలికి ఎక్స్పోజ్ కాకపోవడమే కాక జలుబు, చల్లటి గాలికి వచ్చే తలనొప్పి వంటివి రాకుండా ఉంటాయి.





Untitled Document
Advertisements