పళ్ళు ఎలా తింటే ఆరోగ్యం!

     Written by : smtv Desk | Tue, Nov 02, 2021, 03:17 PM

పళ్ళు ఎలా తింటే ఆరోగ్యం!

ఉదయాన్నే పళ్ళు తినాలి. తాజా పండ్లను పొద్దున్నే తీసుకోవడం వల్ల మీకు తెలియని మేలు చేకూరుతుంది. పండ్లను తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో సహజసిద్దమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. సేమ్ పళ్ళని ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం
* పళ్ళను రెండు గంటల విరామం తీసుకుంటూ ఒక్కోసారి ఒక్కో రకం పండు చొప్పున తినాలి. ఈ ఆ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
* తీసుకునే ఆహారంలో మెత్తగా కాకుండా తో మోతాదులో తీసుకోవడం మంచిది. మీ వయసు, పని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పళ్ళు తినడం మంచిది.
* మనకు ఏ సీజన్లో అయినా వివిధ రకాల పండ్లు లభిస్తాయి. కొన్ని పండ్లు మాత్రం సీజన్ బట్టే లభిస్తాయి. అలాంటి పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.
* ప్రతి సీజన్లో దొరికే పండ్లను తినడం, జ్యూస్లు తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాదు అధిక బరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
* శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్ టాబ్లెట్లు వాడడం కన్నా పండ్లను తింటే సహజసిద్ధమైన విటమిన్లు శరీరానికి లభిస్తాయి.
* ప్రతిరోజూ ఐదు రకాల పండ్ల ముక్కలు లేదా ఆయన ముక్కలు తినడం వల్ల సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు.
* వంటికి నీరు పట్టడం వల్ల వచ్చే ఊబకాయాన్ని తగ్గిస్తుంది డైట్లో 1/3 వంతు పండ్లు, కూరగాయలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. పండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి అందువల్ల కొలెస్ట్రాల్ పెరగదు.
* పండ్లు ఎన్ని తిన్న ఎటువంటి నష్టం లేదు. ఎక్కువ క్యాలరీలు దరిచేరవు
* వేసవిలో ప్రత్యేకంగా ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే పళ్ళు దొరుకుతాయి వీటిని నేరుగా తినడంకానీ, జ్యూస్ తాగడం ద్వారా శరీరానికి చల్లదనం చేకూరుతుంది.
* పనస, కర్బూజ,  అనాస, మామిడి  ఇలా వివిధ రకాల పండ్లు కలిపి తినడం, జ్యూసులు కలిపి తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతోపాటు ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంది.
* ఆరోగ్యాన్ని తక్షణమే ఇచ్చే ఈ ప్రకృతి వరాలు పండ్లు. వ్యాయామాల కోసం ఖర్చు పెట్టడం మానేసి పళ్ళను తినడం అలవాటు చేసుకోండి.





Untitled Document
Advertisements