నమస్కారం చేయడంలోని పరమార్థం?

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 11:08 AM

నమస్కారం చేయడంలోని పరమార్థం?

'నమస్తే ' అనే పదం ' నమరి ', 'తె' అన్న వాటిని కలపడం ద్వారా వచ్చింది. ' నమరి ' అన్నదానికి అర్ధం శిరస్సు వంచడం. 'తె' అంటే మీకు అని అర్ధం. పదం చిన్నదైనా వినయవిధేయతల చిహ్నమైంది. భారతీయ సంస్కృతిలో తల్లి దండ్రులను, ఉపాధ్యాయులను, పడ్డ వారందరినీ గౌరవించడానికి శిరస్సు వంచి నమస్కరించడం ఒక సంస్కారంగా భావిస్తారు. నిజానికి ఇద్దరు వ్యక్తులు కలిసి " నమస్తే " అని ఒకరికొకరు పలకరించుకోవటం అంటే వారి వారి మనస్సులు కలసినవని సూచించుకోవటం అన్నమాట. ఛాతీ ముందు చేతులు జోడించడం దీన్నే సూచిస్తుంది. తలవంచడమంటే స్నేహాన్ని ప్రేమనురాగాల రూపంలో వినమ్రంగా అందించడం. ఇదే మాదిరిగా నమస్కరించి ' జై శ్రీరాం ', ' రాంరాం ', ' జై శ్రీకృష్ణా ', ' నమో నారాయణ ', ' జై సాయిరాం ' వంటి మాటలను కూడా దైవత్వ గుర్తింపుగా అంటూ ఒకరి నొకరు పలకరించు కోవడం, వీడ్కోలు చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది. "నమస్తే" అన్న మాటకు ఆధ్యాత్మిక అర్ధం జీవనశక్తి, దైవత్వం, నమస్కారము అనే సుగుణము సంస్కారులను వర్ణించును. నమస్కారము బ్రతుకులో ఆనందమును నింపుతుంది. అజ్ఞానమును అంతం చేస్తుంది.అహంకారమును ధ్వంసం చేస్తుంది.





Untitled Document
Advertisements