శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకోవాలి!

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 11:55 AM

శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకోవాలి!

సత్యనారాయణస్వామి వ్రతము, గౌరీ పూజ, వివాహము మొదలగు శుభ కార్యాలలోనూ, యజ్ఞయాగాదుల యందు చేతికి కంకణము కట్టుకొనుట ఆచారము. పురుషులకు కుడి చేతికి, స్త్రీలకూ ఎడమ చేతికి కంకణము కడతారు. చేసిన పూజ ఫలం, భావనా తొలగిపోకుండా, ఆ కంకణం ఉన్నంత వరకూ అదే భావన, ప్రశాంతత ఆ కంకణము కట్టుకొనుట వలన సిద్దిస్తుంది. నూలుదారానికి పసుపు రాసి ముంజేతి మణికట్టుకు కడతారు. కంకణ ధారణవల్ల ఆధ్యాత్మికమైన ఈ ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనము కూడా ఉంది. ఆహారీరంలోని జీవ నాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణము కట్టుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాది గర్భాశయం వరకూ ఉంటుంది. అందుకే నాది పట్టుకొని చూసి ఓ స్త్రీ గర్భవతా, కాదా అని కూడా చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలోని జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాల్లో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది. 





Untitled Document
Advertisements