బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయెందుకు?

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 12:58 PM

బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయెందుకు?

పెళ్లి చూపుల సందర్భంలో అమ్మాయి అబ్బాయిని చూడాలన్న, అబ్బాయి అమ్మాయిని చూడాలన్న బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. పెళ్లిలోనూ అంత చుట్టూ చేరి కాబోయే భాగస్వామి గురించి మాట్లాడుతూ ఆటపట్టిస్తుంటే సిగ్గుపడడం సహజం. అలాగే ఎవరైనా మనని పోగిడినప్పుడు సిగ్గుగా అనిపించి బుగ్గలు ఎరుపెక్కుతాయి. ఇంకా మనసుకు నచ్చిన వ్యక్తిని నేరుగా చూడాలి అన్నప్పుడు కూడా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. సందర్భం ఏదైనా సరే సిగ్గుపడ్డప్పుడు బుగ్గలు ఎరుపెక్కడం సహజం. అయితే ఇలా సిగ్గు పడినప్పుడు బుగ్గలు ఎరుపెక్కదానికి గల కారణాలు ఏంటంటే మన మెదడులో దేహ ఉష్ణోగ్రతను నియంత్రించే " హైపోథాలమస్ " అనే కేంద్రం ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను "సెట్ పాయింట్" అంటారు. మనం మనకు ప్రియమైన వ్యక్తిని కలిసినప్పుడో, పొగడ్తలు వంటివి విన్నప్పుడో మన మనసులో ఆలోచనలు ఉత్తేజం చెందడం వల్ల దేహం కొద్దిగా వేడెక్కుతుంది. దాంతో సెట్ పాయింట్ విలువ కూడా పెరుగుతుంది. వెంటనే మెదడు ఈ ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుందేమోననే ఉద్దేశంతో దేహంలో చర్మానికి అతి దగ్గరగా ఉండే రక్తనాళాలను విస్తరింప జేస్తుంది. రక్తనాళాలు విస్తరించినప్పుడు రక్తం చర్మంలో ఒక ప్రవాహ రూపంలో వ్యాపిస్తుంది. ఈ ప్రభావం మెదడుకు దగ్గరలో ఉండే ముఖం, చెవులు, మేడ భాగాలలో ఎక్కువగా కంపించడం వల్ల ఆయా భాగాలు ఎర్రబడి, ముఖ కవళికలుమారి ఎదుటివారికి సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తాయి.





Untitled Document
Advertisements