మన ఆరోగ్యంలో నీటిప్రాముఖ్యత!

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 03:34 PM

మన ఆరోగ్యంలో నీటిప్రాముఖ్యత!

బావినీరు, చెరువునీరు, వర్షపునీరు మనకు అందుబాటులో ఉండేవి. ఒక్కో రకపు  నీరు శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటాయి. నీరు చంద్రుని అంశం. కావున శీతాకాలంలో ఆరోగ్యకరంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి చల్లదనానిచ్చి సహకరిస్తుంది. ఉష్ణాన్ని సమకూర్చి శరీరానికి విశ్రాంతి కలుగజేసి రక్త కాలుష్యాన్ని నివృత్తి చేస్తుంది. అలసట తగ్గిస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీర శక్తిని పెంచుతుంది. తృప్తిని కలిగిస్తుంది. హృదయానికి శాంతిని కలిగిస్తుంది. కేంద్ర శక్తిని పెంచుతుంది చల్లదనాన్ని కలిగిస్తుంది ఎల్లవేళలా శరీరాన్ని కాపాడుతుంది నీరు. ఆహారం సులభంగా జీర్ణమై వంట పట్టడానికి కారణం నీరు. శరీరానికి జీర్ణతత్వాన్ని ప్రసాదిస్తుంది నీరు. నీరు శరీరాన్ని శుభ్రపరిచి రక్త ప్రసారానికి తోడ్పడుతుంది. శరీర చురుకుదనాన్ని పెంచడంలోనూ నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నీటిలో కొన్ని మూలికలు కలిపి వేడిచేసి తాగితే ఎంతో మేలు కలుగుతుంది. కాచి చల్లార్చిన నీటి శక్తి అధికం అవుతుంది. వేడినీరు శరీరంలోని అంతర్భాగాలకు ప్రవేశించి, శుభ్రపరిచి జీవకణాలకు శక్తిని ప్రసాదిస్తుంది. రక్త కాలుష్యము నశిస్తుంది రక్త ప్రసరణ క్రమంగా సాగుతుంది.
ఇది నీరు తాగిన 3 గంటల లోపల ఆ నీటి యొక్క ప్రభావాన్ని చూపుతుంది. అదే విధంగా మూలికలు కలిపి కాచి పెట్టిన నీరు మనం తాగిన 11:30 గంటల  లోపు వంటబట్టి మూలిక యొక్క ప్రభావాన్ని కనబరుస్తుంది. దీనివల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనం ఏర్పడుతుంది. నీరు కొందరిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకొందరిలో గ్రంధులు, రక్తనాళములు పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది.
అలాగే వాతతత్వమును సమపరచడానికి కూడా నీటిని వేడి చేసి అందులో మూడు పుదీనా ఆకులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు గింజలు వేసి కాచి చల్లార్చి కొద్దికొద్దిగా  రోజంతా తాగితే మంచిది.
పిత్త తత్వమునకు నీటిని వేడి చేసి జీలకర్ర, గులాబీ రేకులతో పాటు రెండు లవంగాలను వేసి కాచి చల్లార్చి రోజంతా ఆ నీటిని తాగితే మంచిది.
కఫ తత్వం ఉన్నవారికి ఐదు నిమిషాలు నీటిని కాచి అందులో తులసి ఆకు, అల్లము, సోంపు కలిపి ఆ నీటిని రోజుకు కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే కఫదోష నివారణ ఉపశమనం కలుగుతుంది.
మనం చేసే పనిని బట్టి నీరు త్రాగాలి. ఏ వయసులోనైనా మనం తీసుకోవాల్సిన ఆహారం అనేది మనం కష్టించి పని చేసే విధానం పై ఆధారపడి ఉంటుంది.
అలాగే అతి చల్లని నీరు మంచిది కాదు. భోజనం తర్వాత 40 నిమిషాలకు నీటిని తాగాలి. జగన్ చేసిన వెంటనే  కడుపునిండుగా నీటిని తాగినట్లైతే స్థూలకాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
నీరు జీర్ణశక్తిని పెంచుతుంది, సదా ఆరోగ్యకారి, ఒక్కొక్క సమయంలో నీరు జీవపదార్థంగా, జీవనాధారంగా, ఔన్నత్యం ప్రసాదిస్తుంది.





Untitled Document
Advertisements