గోరింటాకుతో చేతులు ఎర్రగా మారుతాయి?

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 03:35 PM

గోరింటాకుతో చేతులు ఎర్రగా మారుతాయి?

పండగయినా, పబ్బమయినా. పెళ్లి అయినా, పేరంటం అయినా. ప్రతి చిన్న, పెద్ద ఫంక్షన్ ఏదైనా సరే ఆడవారు గోరింటాకు తప్పని సరిగా పెట్టుకుంటారు. ఒకప్పుడు గోరింటాకు కోసి శుభ్రం చేసి చక్కగా రుబ్బు పెట్టుకునే వారు. ప్రస్తుతం ఆధునికత పేరుతో కొన్ల్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. మనం వాటిని కొనుక్కుని చేతికి నచ్చిన డిజైన్లలో మెహేంది పెట్టుకుంటున్నాము. కొంతమంది మెహేంది పెట్టుకోవడం రాని వాళ్ళు, పెట్టుకునే ఓపిక లేని వాళ్ళు బ్యూటీ పార్లర్లకు వెళ్లి డిజైన్ వేయించుకుంటారు.అయితే గోరింటాకు చాలా శ్రేష్టమైనది. పైగా ఒంట్లోని వేడిని కూడా హరించివేస్తుంది. మన ఆయుర్వేదంలో గోరింటాకును ఔషధంగా కూడా వాడుతుంటారు. కోన్ లో రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. ఈ కెమికల్స్ వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం వుంటుంది. కోన్ వాడే ముందు మీ చర్మానికి అది సరిపడుతుందో లేదో ఒకసారి పరీక్షించి చూసుకోవడం మంచిది
అయితే ఇలా గోరింటాకు చేతిపైన ఏర్రగా పండడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదూ.. అయితే గోరింటాకు ఎర్రగా పండడానికి గల కారణం ఏంటో చూసేద్దాం.
మాన్ శరీరం పై చర్మం నాలుగు పొరలుగా నిర్మాణమై ఉంటుంది.అన్నిటి కన్నా పైన ఉండే పొరను స్త్రేటమ్ కార్నియం అంటారు. దాని కింద ఉండే పొరలను వరుసగా ఎపిడేర్మిస్, డేర్మిస్,సబ్క్యూటేనియస్ అని పిలుస్తారు.చేతిపై గోరింటాకు పెట్టగానే దానిలో నీటితో కూడిన ఎర్రని రంగు శరీరం పైన ఉండే మొదటి పొర రంద్రాల్లో నుంచి చర్మం లోపలి ప్రవేశించి రెండో పొర దగ్గర ఆగి పోతుంది. గోరింటాకు ఎండిపోగానే ఎర్రరంగుతో పాటు ఉండే నీరు శరీరంలోని ఉష్ణోగ్రతతో పాటు ఆవిరైపోతుంది. రంగు మాత్రం అలా ఉండిపోతుంది. దీంతో గోరితాకు తీసివేసిన తర్వాత కూడా ఎర్రని రంగు కనిపిస్తుంది. ఇక వేలిగోళ్ళ విషయానికి వస్తే ఎర్రరంగు (పిగ్మేంట్) గోళ్ళలోని పొరల మధ్య చిక్కుకు పోవడం వల్ల గోళ్ళు కూడా ఎర్రబడతాయి. గోళ్ళకన్నా చేతి చర్మంలోని రంద్రాలు విశాలంగా ఉండటంతో చర్మంపై ఏర్పడిన రంగు గోళ్ళపై ఏర్పడిన రంగు కన్నా తొందరగా పోతుంది.





Untitled Document
Advertisements