పాత్రలో ఐస్ వేస్తె పాత్ర చుట్టూ నీళ్ళెలా వస్తాయి?

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 03:36 PM

పాత్రలో ఐస్ వేస్తె పాత్ర చుట్టూ నీళ్ళెలా వస్తాయి?

సాదారణంగా గ్లాసులో ఐస్ క్యుబ్స్ వేసినా లేదా చల్లటి జ్యూస్, కోల్డ్ డ్రింక్స్ ఏదైనా గ్లాసు లో పోసిన గ్లాస్ చుట్టూ బయట వైపు కూడా నీళ్ళు వస్తాయి. అయితే ఇలా జరగడానికి గల కారణాలు గ్లాసులో ఐస్ వేసిన కాసేపటికే గ్లాసు చుట్టూ నీటి బిందువులు ఏర్పడతాయి. ఇవి గ్లాసు లోపలి ఐస్ క్యుబ్స్ కరగటం వల్ల వచ్చిన నీరు కాదు. గ్లాసు లోని ఐస్ వల్ల దాని చుట్టూ ఉన్న టెంపరేచర్ బాగా తగ్గిపోతాయి. ఫలితంగా గ్లాసు చుట్టూ ఉన్న గాలిలోని నీటి ఆవిరి కూడా చల్లబడి నీటిబిందువులుగా మారి గ్లాసు చుట్టూ పేరుకుంటుంది. నీటి ఆవిరి నీరుగా మారే మరో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. అన్నం ఉడికినప్పుడు వచ్చే నీటి ఆవిరికి అడ్డంగా మూత ఉంచితే ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా మారుతుంది. వర్షం కురిసేది కూడా నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారినప్పుడే. నదులు, సముద్రాల్లోని నీరు ఎండకు ఆవిరై పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలకు చల్లగాలి తగిలినప్పుడు అవి ద్రవీభవించి వర్షం రూపంలో నీరు నేలమీదకు చేరుతుంది. ఆ నీరే తిరిగి చివరికి సముద్రంలోకి చేరుతుంది.





Untitled Document
Advertisements