వణుకు రావడానికి కారణం?

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 04:23 PM

వణుకు రావడానికి కారణం?

వణుకు అంటే మన ప్రమేయంలేకుండానే కండరాలు సాగుతూ, యధాస్థితికి వస్తూ ఉండడం వలన వణుకు వస్తుంది. కండరాలు ఇలా అసంకల్పితంగా కదలడం బాగా చలివేసినప్పుడే జరగడానికి ప్రత్యేక కారణం ఉంది. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. అయితే శరీరానికి కనీస ఉషోగ్రత ఉండాలి! దానికోసం శరీరం కండరాలను అదే పనిగా కదిలించడం చేస్తుంది. ఫలితంగా ఏర్పడే ఉష్ణం శరీరాన్ని సాధారణ స్థితిలో ఉంచుతుంది. వృద్దుల్లో వణుకు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. అయితే చలిగా ఉన్నప్పుడు ఉన్ని దుస్తువులు ధరించడం వలన వెచ్చగా ఉంటుంది. ఒక వేడి వస్తువు, ఇంకో చల్లటి వస్తువు ఆనుకొని ఉన్నాప్పుడు వేడి వస్తువులోని ఉష్ణం చల్లటి వస్తువులోకి చేరి రెండింటి వేడి సమానం అవుతుంది. శీతాకాలంలో మన శరీరం కూడా వేడిని కోల్పోయి చల్లబడకుండా ఉండటానికే ఉన్ని దుస్తువులు వాడతాము. ఉన్ని దుస్తుల్లోని ఊలు దారాల మధ్య ఖాళీ ప్రదేశాలుంటాయి.మనం వాటిని ధరించినప్పుడు శరీరానికి, దుస్తులకు మధ్య ఖాళీ ప్రదేశాలలో, ఉన్నిపోగుల మధ్య ఖాళీల్లో గాలి ఉంటుంది. గాలి ఉష్ణ వాహకం కాదు ( అంటే వేడిని ఒక చోటి నుండి మరొక చోటికి సులువుగా పంపదు ). దాంతో శరీరంలోని వేడి వాతవరణంలోకి వెళ్ళదు. వేడి బయటకి వెళ్ళకుండా చేయడంలో ఉన్నిపోగులు కూడా సహకరిస్తాయి. అలాగే వాతవరనంలోని చలి శరీరానికి చేరకుండా ఉంటుంది. ఉన్ని దుస్తులు వేసుకుంటే శరీరంలోని వేడి బయటికి పోదు, చలి శరీరానికి తాకదు. కాబట్టి శరీరం వెచ్చగానే ఉంటుంది.





Untitled Document
Advertisements