రక్తం ఎర్రగా ఉండడానికి, గడ్డ కట్టడానికి గల కారణాలు?

     Written by : smtv Desk | Sat, Nov 06, 2021, 11:13 AM

రక్తం ఎర్రగా ఉండడానికి, గడ్డ కట్టడానికి గల కారణాలు?

రక్తంలో ఉండే ఎర్రని రక్తకణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఉండే ఇనుము వల్లనే రక్తం ఎర్రగా ఉంటుంది. హిమోగ్లోబిన్, ఊపిరితిత్తుల ద్వారా అందే ఆక్సిజన్ తోకలిసి ఒక రసాయనిక బంధం ఏర్పరచుకుంటుంది. ఇలా ఆక్సిజన్ రక్తంతో పాటు శరీరమంతా ప్రయాణిస్తుంది. హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ నిండి ఉన్నాప్పుడు అది కాంతివంతమైన ఎరుపురంగు కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటె దాని అణు నిర్మానక్రమం మారిపోయి అది శోశించుకునే కాంతిని బట్టి దాని రంగు ఉంటుంది. అందువల్లనే ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తం కొన్వ్హెం నలుపు రంగులో ఉంటుంది. అలాగే రక్తం గడ్డకట్టడానికి మాన్ శరీరానికి గాయం అయినప్పుడు కొంత రక్తం కారుతుంది. గాయం చిన్నదైతే కొంతసేపటికి రక్తం దానంతట అదే గడ్డ కడుతుంది. దీనికి కారణం మన రక్తంలో ద్రవ పదార్దం వంటి ప్లాస్మా కాకుండా ఇంకా మూడు రకాల కణజాలాలు ఉంటాయి. అవి ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు, రక్త ఫలకికలు (ప్లేట్లెట్స్ ). రక్తం గడ్డకట్టడానికి ఈ ప్లేట్ల్ లెట్స్ కారణం. ఇవి గాయం చుట్టూ చేరి రక్తంలోని ప్లాస్మా నుంచి త్రోంబాప్లాస్టిక్ అనే పదార్ధాన్ని తయారు చేస్తాయి. రక్తంలో కాల్షియం, ప్రోత్రోమ్బిన్లు ఉంటాయి. వాటితో ఈ త్రోంబో ప్లాస్టిక్ కలుస్తుంది.ఇవన్నీ కలసి రక్తంలో ఉండే పైబ్రోనోజిన్ అనే ప్రోటీన్ తో ప్రతిక్రియ జరుపుతాయి. ఈ చర్యతో పైబ్రెన్ ఏర్పడుతుంది. ఈ పైబ్రెన్లో ఉండే దారాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి రక్తాన్ని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఆ తరువాత ఈ పైబ్రెన్ దారాలు గట్టిగా ఏకమై అతుక్కుపోతాయి. దీనికితోడు ప్లేట్తైట్ నుంచి తయారయ్యే సిరోటినిన్ అనే మరో రకం హార్మోన్ రక్థాన్నీ సంకోచింప చేస్తుంది. దాంతో గాయం వద్ద రక్తం స్రవించడం ఆగుతుంది.





Untitled Document
Advertisements