ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా?

     Written by : smtv Desk | Sat, Nov 06, 2021, 11:15 AM

ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా?

సాధారణంగా ప్రతిరోజు 1.5 నుండి 2 గ్రాముల ఉప్పు వాడదగినది. ఇంతకంటే పరిమాణం పెంచితే ప్రమాదమే మరి అంటున్నారు నిపుణులు.
కారణం రక్త పీడనము పెరగడానికి ఇది ముఖ్య కారణం. అధిక రక్త పీడనానికి హైబీపీకి ఇదొక్కటే ప్రమాదకరమైన కారణం గా గుర్తించబడింది. అన్ని రకాల రక్త ప్రసరణ వ్యాధులకు అధిక ఉప్పు వాడటమే మూలకారణంగా తెలుసుకున్నారు.
గుండె సంబంధమైన వ్యాధులకు అధిక రక్త పీడనమే కారణం. నిల్వ చేసిన ఫాస్ట్ఫుడ్స్, డబ్బాల్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను వాడడం మంచిది కాదు.
సోడియం తక్కువగా ఉంటే తాజా పళ్లు కూరగాయలు శ్రేయస్కరం. కూరగాయలు అప్పడాలు వడియాలు వాడడం మానండి. నిల్వ ఆహారాలు తినడం  మానండి.
ప్రతిరోజు వయోజనులు ఒక టీస్పూన్ మించి ఉప్పు తినరాదు అనే ప్రపంచ ఆహార సంస్థ పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఒక్క గ్రామ్ ఉప్పులో 393 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఆహారంలో సగానికి సగం ఒప్పు తగ్గించుకుంటే ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడకుండా, మరణాలు చెందకుండా కాపాడుకోవచ్చు.





Untitled Document
Advertisements